Book LPG Cylinder : గ్యాస్ అయిపోయిందా? ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే సిలిండర్.. సింపుల్ బుకింగ్ ఆప్షన్లు.. ఫాస్ట్ డెలివరీ!
Book LPG Cylinder : గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం భారీ క్యూలో నిలబడాల్సిన పనిలేదు. మీ ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా ఈజీగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. సింపుల్ బుకింగ్ ఆప్షన్లు ఓసారి ట్రై చేయండి.
- Sreehari A
- Published On : March 14, 2026 / 05:23 PM IST
Book LPG Cylinder
- గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా? బుకింగ్ కోసం ట్రై చేస్తున్నారా?
- గ్యాస్ కొరతతో భారీగా క్యూలో బారులు తీరిన వినియోగదారులు
- ఇండేన్, హెచ్ పీ గ్యాస్, భారత్ గ్యాస్ ఏదైనా గ్యాస్ బుకింగ్ ఈజీ
- ఈ సింపుల్ ఆప్షన్లతో గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు
Book LPG Cylinder : మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ట్రై చేస్తుంటే ఇది మీకోసమే.. ఎల్ పీజీ గ్యాస్ కొరత కారణంగా చాలామంది వినియోగదారులు సిలిండర్ రీఫిలింగ్ కోసం భారీ క్యూలో బారులు తీరుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా సింపుల్ గా ఇంటిదగ్గర నుంచే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు.
గ్యాస్ కంపెనీలు కూడా వినియోగదారుల కోసం అనేక గ్యాస్ బుకింగ్ ఆప్షన్లు అందిస్తున్నాయి. ఇండేన్, హెచ్ పీ గ్యాస్, భారత్ గ్యాస్ ఏదైనా సరే.. వాట్సాప్, మిస్డ్ కాల్స్, ఐవీఆర్ఎస్ సిస్టమ్స్, మొబైల్ యాప్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫారాల ద్వారా ఇంటి నుంచే సిలిండర్ రీఫిల్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇండేన్ సిలిండర్ బుకింగ్ ఎలా? :
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు వాట్సాప్, ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ కాల్స్, మిస్డ్ కాల్ సర్వీసెస్, మొబైల్ అప్లికేషన్లు, ఆన్ లైన్ పోర్టల్స్ వంటి మల్టీ ఛానల్స్ ద్వారా రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ బుకింగ్ :
వాట్సాప్ ద్వారా బుకింగ్ కోసం ముందుగా మీ ఫోన్‌లో అధికారిక ఇండేన్ బుకింగ్ నంబర్ 7588888824 సేవ్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసి సేవ్ చేసిన నంబర్‌తో చాట్ చేయాలి. “REFILL” అనే మెసేజ్ పంపాల్సి ఉంటుంది. సిస్టమ్ కస్టమర్ వివరాలను వెరిఫై చేశాక రీఫిల్ రిక్వెస్ట్ వస్తుంది. సాధారణంగా బుకింగ్ వివరాలతో కన్ఫార్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఇతర బుకింగ్ ఆప్షన్లు :
- SMS లేదా IVRS సర్వీసులు
- మిస్డ్ కాల్ రీఫిల్ బుకింగ్
- ఇండేన్ మొబైల్ అప్లికేషన్
- ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు
ఎమర్జెన్సీ కోసం ఇండేన్ 24 గంటల LPG ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 1906 కూడా అందిస్తుంది. సిలిండర్ డెలివరీ టైమ్, కనెక్షన్ ఆన్‌లైన్ పోర్టబిలిటీ, ఆన్‌లైన్ పేమెంట్లు, కొత్త కనెక్షన్ కోసం డిజిటల్ సర్వీసులు కూడా అందిస్తుంది.
Read Also : PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ 22వ విడత రూ. 2 వేలు ఇంకా రాలేదా? మీ ఖాతాలో పడాలంటే వెంటనే ఇలా చేయండి!
HP గ్యాస్ రీఫిల్ బుకింగ్ ఎలాగంటే? :
హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లకు ఎల్పీజీ రీఫిల్‌లను బుకింగ్ కోసం IVRS, మిస్డ్ కాల్స్, వాట్సాప్ మెసేజ్, మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లతో సహా అనేక మార్గాలు ఉన్నాయి.
IVRS బుకింగ్ :
ఆటోమేటెడ్ IVRS సిస్టమ్ ద్వారా రీఫిల్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 88888 23456కు డయల్ చేయండి.
మిస్డ్ కాల్ బుకింగ్ :
రిజిస్టర్డ్ నంబర్ నుంచి 94936 02222కు మిస్డ్ ఇచ్చి రీఫిల్ రిక్వెస్ట్ పొందవచ్చు.
వాట్సాప్ బుకింగ్ :
హెచ్‌పీ గ్యాస్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 92222 01122కు ‘Hi’ మెసేజ్ పంపడం ద్వారా వాట్సాప్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఇతర బుకింగ్ వివరాలు :
- మొబైల్ (HP Pay) యాప్
- ఉమాంగ్ యాప్
- అధికారిక (myhpgas.in) వెబ్‌సైట్
- బిల్ పేమెంట్ సెక్షన్ కింద Amazon Pay, Paytm, PhonePe వంటి డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు
- లోకల్ HP గ్యాస్ పంపిణీదారులు లేదా కస్టమర్ సర్వీసు సెంటర్లు ఉన్నాయి.
భారత్ గ్యాస్ LPG రీఫిల్ బుకింగ్ ఎలాగంటే? :
భారత్ గ్యాస్ కస్టమర్లు భారత్ గ్యాస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా రీఫిల్ బుక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి “Bharatgas” కోసం సెర్చ్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాప్ ఓపెన్ చేసి యాక్టివేట్ ఆప్షన్ ఎంచుకోండి.
- LPG యూజర్ ఐడీకి లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- యాక్టివేషన్ కోడ్ SMS ద్వారా వస్తుంది.
- యాక్టివేషన్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు యాప్‌లో కోడ్‌ను ఎంటర్ చేయండి.
ఈ యాక్టివేషన్ ప్రాసెసర్ ఒకసారి మాత్రమే. యాక్టివేట్ తర్వాత వినియోగదారులు యాప్‌ని వినియోగించవచ్చు.
- LPG రీఫిల్ సిలిండర్లను బుక్ చేసుకోండి
- ఆన్‌లైన్ పేమెంట్లు చేయండి
- రీఫిల్ హిస్టరీని చెక్ చేయండి
- ఫిర్యాదులను రిజిస్టర్ చేయండి
- ఇతర కస్టమర్ సర్వీసులను యాక్సెస్ చేయండి
