Cooler Power Bills : ఈ సమ్మర్‌లో మీ కూలర్ సెట్టింగ్‌ ఇలా మార్చండి.. ఇక ఇల్లంతా కూల్ కూల్.. పవర్ బిల్లు చాలా తక్కువ..!

Cooler Power Bills : మీ ఇంట్లో కూలర్ ఉందా? ఎండకాలం వచ్చిందని అదేపనిగా కూలర్ ఆన్ చేస్తున్నారా? ఇలా కూలర్ స్పీడ్ సెట్టింగ్ పెట్టారంటే మీ నెలవారీ పవర్ బిల్లు భారీగా తగ్గుతుంది.. అది ఎలాగంటే?

Cooler Power Bills

  • కొత్త కూలర్ కొనేందుకు చూస్తున్నారా?
  • మీ ఇంట్లో పాత కూలర్ ఉంటే ఇలా చేయండి
  • కూలింగ్ స్పీడ్ సెట్టింగ్ ద్వారా పవర్ బిల్లు భారీగా ఆదా

Cooler Power Bills : ఏప్రిల్ వచ్చింది. ఎండలు కూడా పెరిగాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత కూడా పెరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వేడి వాతావరణ ఉంటోంది. సమ్మర్ వచ్చిందంటూ చాలామంది పాత ఏసీలు, కూలర్లకు పనిచెబుతుంటారు. అయితే, పాత కూలర్ అయినా కొత్త కూలర్ అయినా కూలర్ స్పీడ్ ఆధారంగానే గది కూలింగ్ ఉంటుంది.

కానీ, కూలర్‌ను ఏ సెట్టింగ్‌లో పెడితో గది తొందరగా కూలింగ్ అవుతుందో చాలా మందికి తెలియదు. కూలర్‌లలో సాధారణంగా లో, మిడ్, హైస్పీడ్ ఆప్షన్లు ఉంటాయి. ఈ స్పీడ్ ఫ్యాన్ ఎయిర్ ఫ్లోను కంట్రోల్ చేస్తుంది. కానీ, కూలర్‌ను అన్నివేళలా హై స్పీడ్ ద్వారా నడపాల్సిన అవసరం లేదు. మీరు ఉండే వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కూలర్ ఫ్యాన్స్ స్పీడ్ అడ్జెస్ట్ చేసి మెరుగైన కూలింగ్ అందిస్తుంది.

కూలర్ కోసం ఏ స్పీడ్ బెస్ట్ అంటే? :
ఏప్రిల్ ఆరంభంలో వేడి మరీ ఎక్కువగా ఉండదు. కూలర్‌ను మిడ్ స్పీడ్ తో రన్ చేయడం బెటర్. మంచి ఎయిర్ ఫ్లో పెరిగి గదిని చల్లగా ఉంచుతుంది. మధ్యాహ్నం వేళ చాలా వేడిగా ఉంటే కొద్దిసేపు హై స్పీడ్ పెట్టుకోవచ్చు. కానీ, అదేపనిగా రన్ చేయాల్సిన అవసరం లేదు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉదయం చలిగా అనిపించకుండా ఉండేందుకు పడుకునే ముందు కూలర్ స్పీడ్ తగ్గించండి.

Read Also : Haier Desert Rose AI AC : ఈ కొత్త AI స్మార్ట్ ఏసీ చూశారా? రిమోట్‌తో పనిలేదు.. మీరు ఇంటికెళ్లే లోపే కూలింగ్ చేస్తుంది.. ధర ఎంతంటే?

ఎయిర్, వెంటిలేషన్ జాగ్రత్తలివే :
గదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఉంటే కూలర్ బాగా పనిచేస్తుంది. గది పూర్తిగా మూసి ఉంటే కూలర్ కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. అందుకే గదిలో గాలి బయటకు వెళ్లేందుకు కిటికీని లేదా తలుపును కొద్దిగా తెరిచి ఉంచండి. మిడ్ రేంజ్ స్పీడ్ కూడా మంచి కూలింగ్ అందిస్తుంది.

వాటర్, కూలింగ్ ప్యాడ్‌లు తప్పనిసరి :
కూలింగ్ సామర్థ్యం కేవలం స్పీడ్ మాత్రమే కాకుండా నీరు, కూలింగ్ ప్యాడ్‌లపై కూడా ఆధారపడి ఉంటుంది. కూలర్‌లో ఎల్లప్పుడూ తగినంత నీటిని ఉంచండి. కూలింగ్ ప్యాడ్‌లను శుభ్రంగా ఉంచండి. ప్యాడ్‌లు డర్టీగా ఉంటే హై స్పీడ్ కూడా సరైన కూలింగ్ అందించదు. క్లీన్, తడి ప్యాడ్‌లతో కూడిన మిడ్ రేంజ్ స్పీడ్ మంచి కూలింగ్ అందిస్తుంది.

పవర్ సేవింగ్ చేయొచ్చు :
మీ పవర్ బిల్లును తగ్గించుకోవాలంటే మీ కూలర్‌ను ఎల్లప్పుడూ హై స్పీడ్‌తో రన్ కావొద్దు. రాత్రిపూట కూలర్‌ను తక్కువ లేదా మిడ్ స్పీడ్‌తో రన్ అవుతుంది. మంచి నిద్రతో పాటు పవర్ వినియోగం కూడా తగ్గుతుంది.