బిగ్ బ్రేకింగ్.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. ఏ కంపెనీ ఎంత పెంచిందంటే..
Preium Petrol Price Hike : గ్యాస్ సిలిండ్ల కొరతతో ఇబ్బంది పడుతున్న జనాలకు మరో షాక్ తగిలింది. పెట్రోల్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
- Dharani Pilli
- Published On : March 20, 2026 / 03:03 PM IST
HPCL Hikes Premium Petrol Price by Rs 2 per Litre
Preium Petrol Price Hike : ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో విలవిల్లాడుతున్న జనాల నెత్తిన మరో పిడుగు పడింది. పెట్రోల్ ధరలను పెంచుతూ ఓ కంపెనీ నిర్ణయం తీసుకుంది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపు కేవలం తన తన ప్రీమియం గ్రేడ్ ‘పవర్ పెట్రోల్’ కే వర్తిస్తుంది. ఈ ప్రీమియం గ్రేడ్ పవర్ పెట్రోల్ ధరను లీటర్ మీద రూ.2 మేర పెంచింది. ఇదిలా ఉంటే HPCL. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు అని CNBC నివేదిక తెలిపింది.
ఈ ధర పెంపు కేవలం హై-ఆక్టేన్ (అధిక నాణ్యత) ఇంధనానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఇంధనం ప్రధానంగా అధిక పనితీరు (హై-పర్ఫార్మెన్స్) వాహనాల్లో వినియోగిస్తారు. సాధారణ పెట్రోల్ ఉపయోగించే ఎక్కువ మంది వినియోగదారులపై ఈ ధర పెంపు ప్రభావం ఉండదని కంపెనీ యాజమాన్యం చెబుతుంది.
HPCLతో పాటు.. ఐవోసీఎల్ ఎక్స్‌పీ95, బీపీసీఎల్ స్పీడ్ వంటి కంపెనీలు కూడా.. వాటి ప్రీమియం పెట్రోల్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు ప్రాంతాన్ని బట్టి ఉంటుందని..మొత్తం మీద ప్రీమియ పెట్రోల్ ధరపై లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
