Hyundai Car Discounts : హ్యుందాయ్ బంపర్ డిస్కౌంట్లు.. ఈ ఏప్రిల్‌లో 5 పాపులర్ కార్లపై రూ. 60వేలు తగ్గింపు.. ఏ మోడల్ ధర ఎంతంటే?
Hyundai Car Discounts : హ్యుందాయ్ పలు కార్లపై ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. ఈ ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ కారు కొనుగోలుపై రూ. 60వేల వరకు సేవ్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- April 15, 2026 / 06:18 PM IST
Hyundai Car Discounts
- హ్యుందాయ్ కారు కొనేవారికి బంపర్ డిస్కౌంట్లు
- ఈ పాపులర్ కార్లపై రూ. 60వేల వరకు సేవింగ్
- ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ కార్లపై ఎంత తగ్గింపు అంటే?
Hyundai Car Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు హ్యుందాయ్ అభిమానులైతే ఈ ఆఫర్లు మీకోసమే.. ఏప్రిల్ నెలలో కొత్త కారు కొనేవారికి కోసం హ్యుందాయ్ మోటార్ ఇండియా అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం అనేక కార్లపై కిర్రాక్ ఆఫర్లను అందిస్తోంది. హ్యుందాయ్ కారు కొనుగోలుపై భారీగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
ఈ ఏప్రిల్‌లో కంపెనీ అనేక పాపులర్ కార్లపై రూ. 60వేల వరకు (Hyundai Car Discounts) డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా గత ఏడాదిలో సేల్స్ కొద్దిగా తగ్గినప్పటికీ ఇప్పుడు పెంచుకునేందుకు కంపెనీ ఈ ఆఫర్లను భారీగా అందిస్తోంది. ప్రతి హ్యుందాయ్ కారుపై ఎంత తగ్గింపు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యుందాయ్ కారు డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు :
హ్యుందాయ్ ప్రస్తుతం వెర్నా, ఆరా, i20, i10 నియోస్ వంటి కార్లపై తగ్గింపులివే
- హ్యుందాయ్ ఆరా : రూ. 15,000 వరకు తగ్గింపు
- హ్యుందాయ్ వెర్నా : రూ. 35,000 వరకు తగ్గింపు
- హ్యుందాయ్ i20 : రూ. 50,000 వరకు ఆఫర్లు
- హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ : రూ. 60,000 వరకు ఆఫర్లు
- హ్యుందాయ్ అల్కాజర్ : రూ. 60,000 వరకు ఆఫర్లు
ఈ ఆఫర్లకు అదనంగా హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల ద్వారా వినియోగదారులకు రూ.20వేల వరకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, ఇతర ఆఫర్లు ఉండవచ్చు. ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకు అంటే ఏప్రిల్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.
అయితే, వేరియంట్ సిటీని బట్టి ఆఫర్‌లు కొద్దిగా మారే అవకాశం ఉందని గమనించాలి. అందుకే, ఏదైనా కారు కొనుగోలు చేసే ముందు దయచేసి మీ సమీప డీలర్‌ను సంప్రదించండి. ఈ సేల్ సమయంలో హ్యుందాయ్ క్రెటా వెన్యూ వంటి ఎస్‌యూవీలపై హ్యుందాయ్ ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవు. ఈ రెండు కార్లకు ఇప్పటికే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. కంపెనీ వాటిపై ఎలాంటి ఆఫర్లను అందించలేదు.
