Hyundai Car Discounts : హ్యుందాయ్ డిస్కౌంట్ ధమాకా.. వెర్నా, క్రెటా, i20 కార్లపై రూ. 1.10 లక్షల డిస్కౌంట్.. ఫుల్ లిస్ట్ ఇదే!

Hyundai Car Discounts : ఈ నెలలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, i20, క్రెటా, వెర్నా, అల్కాజార్ కార్లను మొత్తం రూ. 1.10 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ సపోర్ట్, అప్‌గ్రేడ్ స్కీమ్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Hyundai Car Discounts

  • హ్యుందాయ్ కస్టమర్ల కోసం అద్భుమైన డిస్కౌంట్లు
  • ఈ ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు
  • వెర్నా, క్రెటా, ఐ20 కార్లపై రూ. 1.10 లక్షల వరకు బెనిఫిట్స్

Hyundai Car Discounts : హ్యుందాయ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ పాపులర్ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలు, ఈవీలపై అద్భుతమైన బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.

నివేదికల ప్రకారం.. ఈ నెలలో మీరు కంపెనీ గ్రాండ్ హ్యుందాయ్ ఐ10 నియోస్, ఐ20, క్రెటా, వెర్నా, అల్కాజార్‌లను రూ. 1.10 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సపోర్ట్, అప్‌గ్రేడ్ స్కీమ్, కార్పొరేట్ బెనిఫిట్స్, ఇతర ఆఫర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఏప్రిల్ 2026 డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రాండ్ ఐ10 నియోస్ :
ఈ నెలలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కారు అద్భుతమైన ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఇందులో ఎంపిక చేసిన హై-ఎండ్ మోడళ్లపై రూ.68వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ 83PS పవర్, 113.8Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. 69PS పవర్‌ను ఉత్పత్తి చేసే CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఆరా :
ఈ నెలలో హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ రూ. 20వేల వరకు డిస్కౌంట్లతో లభిస్తుంది. నియోస్ మాదిరిగానే ఈ సెడాన్ కూడా 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. బూట్ స్పేస్‌ కోరుకునే కొనుగోలుదారులకు డిజైర్‌ మాదిరిగా అద్భుతంగా ఉంటుంది. మొత్తంమీద ఆరా నగరవాసులకు, ఫ్లీట్ ఆపరేటర్లకు అద్భుతమైన సెడాన్.

హ్యుందాయ్ i20 :
హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. N లైన్ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. ఏప్రిల్‌లో ఈ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ. 58వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. 83PS పవర్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. మాన్యువల్, సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఎన్ లైన్ వేరియంట్ 120PS పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

వెన్యూ :
హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. ఈ వెన్యూపై ఏప్రిల్ నెలలో కేవలం రూ. 5వేల వరకు మాత్రమే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ పెట్రోల్, 1.0-టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తోంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. మీ భార్యతో ఇలా పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 9,250 గ్యారంటీ.. ఎలాగంటే?

ఎక్స్‌టర్ :
నివేదికల ప్రకారం.. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ పాత స్టాక్‌పై రూ. 43వేల వరకు, కొత్త మోడళ్లపై రూ. 5వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌టర్ హ్యుందాయ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

వెర్నా :
హ్యుందాయ్ వెర్నా iVT ట్రిమ్‌లపై రూ. 1.10 లక్షల వరకు మొత్తం డిస్కౌంట్ పొందవచ్చు. హ్యుందాయ్ వెర్నా 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 160PS పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఈ సెగ్మెంట్‌లోని అత్యంత పవర్ ఫుల్ సెడాన్‌లలో ఒకటిగా చెప్పొచ్చు.

క్రీట్ :
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్, ఎన్ లైన్ వేరియంట్లపై రూ. 55,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 1.5-లీటర్ పెట్రోల్, 1.5-టర్బో-పెట్రోల్, 1.5-డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభించే క్రెటా, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బాగా పాపులర్ అయింది. మీరు క్రెటా ఎలక్ట్రిక్‌ కోసం చూస్తుంటే మీరు రూ. లక్ష వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

అల్కాజార్ :
హ్యుందాయ్ అల్కాజర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 70వేల వరకు, డీజిల్ వేరియంట్‌పై రూ. 30వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ ఎస్‌యూవీ 1.5 టర్బో-పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది.