Hyundai July 2026 Discounts : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. హ్యుందాయ్ కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 85వేలు ఆదా..!
Hyundai July 2026 Discounts : హ్యుందాయ్ కొత్త మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, స్క్రాపేజ్ బోనస్‌లతో రూ. 85వేల వరకు అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఏయే కార్లపై ఎంత డిస్కౌంట్ ఉందంటే?
- Sreehari A
- Updated on- July 6, 2026 / 05:25 PM IST
Hyundai July 2026 Discounts
- ఈ జూలైలో హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు
- క్రెటా, వెన్యూ, ఎక్స్ టర్ మోడళ్లపై రూ. 85వేలు వరకు ఆదా
- ప్యాసింజర్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
Hyundai July 2026 Discounts : హ్యుందాయ్ లవర్స్‌కు ఎగిరిగంతేసే న్యూస్.. మీరు ఈ జూలైలో కొత్త హ్యుందాయ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. కంపెనీ ప్యాసింజర్ కార్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో ఎంపిక చేసిన క్రెటా వేరియంట్లపై రూ. 85వేల వరకు అత్యధిక బెనిఫిట్స్ అందిస్తోంది.
ప్రత్యేకించి ఎక్స్టర్, వెర్నా, అల్కాజర్, గ్రాండ్ i10 నియోస్, i20 వంటి ఇతర మోడళ్లు కూడా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో అలాగే స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. కచ్చితమైన డిస్కౌంట్ అనేది మోడల్ నుంచి మోడల్‌కు మారుతుంది. కానీ, పాత కారుతో ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం కొనుగోలుదారులు భారీ మొత్తంలో డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
క్రెటా , అల్కాజర్, వెర్నాపై భారీగా ఆదా :
ఈ నెలలో హ్యుందాయ్ క్రెటాకు ఫుల్ డిమాండ్ ఉంది. బేస్ ఇ వేరియంట్ మినహా కొనుగోలుదారులు రూ. 35వేల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత కారు స్క్రాప్ చేస్తే మరో రూ. 50వేలు క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా మొత్తం బెనిఫిట్ రూ. 85వేలు అవుతుంది.
జూలై ఆఫర్ల జాబితాలో క్రెటా ఎలక్ట్రిక్ కూడా ఉంది. దీనిపై రూ. 15వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. కాగా, కొనుగోలుదారులు రూ. 35వేలు స్క్రాపేజ్ బెనిఫిట్ గానీ లేదా రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఏదైనా ఎంచుకోవచ్చు.
అల్కాజర్ పెట్రోల్ వెర్షన్‌లపై రూ. 40వేలు క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. అర్హతను బట్టి హ్యుందాయ్ అప్‌గ్రేడ్ బెనిఫిట్స్, రూ. 25వేలు స్క్రాపేజ్ బెనిఫిట్ లేదా రూ. 20వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. వెర్నాపై రూ. 10వేలు క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ స్కీమ్ కింద రూ. 25వేలు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 20వేల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలపై బిగ్ డిస్కౌంట్లు :
కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్HX2 వేరియంట్ మినహా మిగతా అన్ని వేరియంట్లపై రూ. 20వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. కొనుగోలుదారులు అదనంగా రూ. 20వేలు స్క్రాపేజ్ బెనిఫిట్స్ లేదా రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌లలో గ్రాండ్ i10 నియోస్ అనేది ఆకర్షణీయమైన ఆఫర్. పెట్రోల్ వేరియంట్లపై రూ. 30వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు. సీఎన్‌జీ వెర్షన్‌లపై రూ. 25వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారు అర్హతను బట్టి ఎక్స్ఛేంజ్ కార్పొరేట్ స్కీమ్స్ విడిగా పొందవచ్చు.
i20 విషయానికొస్తే.. ఎరా ట్రిమ్ మినహా అన్ని వేరియంట్‌లపై హ్యుందాయ్ రూ. 25వేలు క్యాష్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ తర్వాత కొనుగోలుదారులు రూ. 20వేలు స్క్రాపేజ్ బెనిఫిట్స్ లేదా రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ మధ్య ఎంచుకోవచ్చు.
హ్యుందాయ్ ఆరాపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై రూ. 10వేలు క్యాష్ డిస్కౌంట్ ఉండగా, సీఎన్‌జీ వెర్షన్లకు రూ. 20వేలు లభిస్తుంది. రూ. 5వేలు స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో ఇతర ఎస్‌యూవీల మాదిరిగా ఈ నెలలో వెన్యూ ఎన్ లైన్‌పై నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. అర్హులైన కొనుగోలుదారులకు హ్యుందాయ్ రూ. 5వేలు స్క్రాపేజ్ బోనస్ అందిస్తోంది.
కొత్త కారు కొనే ప్రతి కస్టమర్‌కు ఈ స్కీమ్స్ ఒకేలా ఉండవు. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ కార్పొరేట్ బెనిఫిట్స్ అర్హత బట్టి ఉంటాయి. అయితే, స్టాక్ లభ్యత డీలర్-లెవల్ ఆఫర్‌లు సిటీలను బట్టి మారవచ్చు. బుకింగ్ ఫారమ్‌పై సైన్ చేసే ముందు వర్తించే అన్ని బెనిఫిట్స్ పూర్తి వివరాలను అడిగి తెలుసుకోండి.
