Gold Price: గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడేవెళ్లి కొనుక్కున్నారనుకో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది.

Gold

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.700 తగ్గింది.

దీంతో తులం బంగారం ధర రూ.79,400గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.710 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ.86,670గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇంతే ఉన్నాయి.

Gold Rate Today

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.79,550గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.710 తగ్గి రూ.86,820గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గింది. ముంబైలో తులం బంగారం ధర రూ.79,400గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.710 తగ్గి, తులం బంగారం ధర రూ.86,670గా ఉంది

ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనపడలేదు

ఏ నగరాల్లో ఎలా?

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది