Income Tax Notice 2025 : మీ క్రెడిట్ కార్డు ఖర్చులపై ఇన్‌కమ్ ట్యాక్స్ నిఘా.. ఇలా పేమెంట్ చేస్తే ఖతమే.. ఏ క్షణమైనా ఐటీ నోటీసులు రావొచ్చు!
Income Tax Notice 2025 : క్రెడిట్ కార్డుతో అదేపనిగా పేమెంట్లు చేస్తున్నారా? బిల్లు లక్ష దాటేసిందా? క్యాష్ పేమెంట్లు ఎక్కువగా చేస్తున్నారా?

Income Tax Notice 2025
Income Tax Notice 2025 : క్రెడిట్‌కార్డు హోల్డర్లకు బిగ్ షాకింగ్ న్యూ్స్.. కార్డు ఉంది కదా అని అదేపనిగా తెగ ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో (Income Tax Notice 2025) క్రెడిట్ కార్డుల వాడకం భారీగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్, ప్రయాణం, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఈఎంఐ పేమెంట్ల కోసం క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు.
కానీ, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు అనేవి కేవలం మీకు బ్యాంకుకు మధ్య ఉన్న సంబంధం మాత్రమే అని మీరు అనుకుంటే అది పొరపాటే.. ఎందుకంటే.. మీరు సంపాదించే ప్రతి రూపాయితో పాటు మీరు చేసే ప్రతి ఖర్చుపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఓ కన్నేసి ఉంచుతుంది.
ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను కూడా నిశితంగా పరిశీలిస్తోందని మరవద్దు. ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డు బిల్లు నిర్దిష్ట పరిమితిని మించిన సమయాల్లో ఐటీ శాఖ అలర్ట్ అవుతుంది. మీరు చేసే లావాదేవీలపై ఏం కొంచెం అనుమానం వచ్చినా వెంటనే మీ ఇంటికి ఐటీ నోటీసులు పంపుతుంది. అసలు ఏయే సందర్భాల్లో ఐటీ శాఖ నోటీసులు పంపుతుంది? అలా వస్తే ఏం చేయాలి? ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Income Tax Notice 2025 : ఐటీ శాఖ దృష్టికి ఎలా? :
క్రెడిట్ కార్డులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని షరతులను నిర్ణయించింది. ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డుతో సంవత్సరానికి రూ. 2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే లేదా ఏదైనా నెలలో రూ. లక్ష కన్నా ఎక్కువ బిల్లును క్యాష్ రూపంలో చెల్లిస్తే ఆ సమాచారం నేరుగా పన్ను శాఖకు చేరుతుంది.
అలాంటి సందర్భాలలో ఐటీ శాఖ మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్‌ను చెక్ చేస్తుంది. మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో పేర్కొన్న ఆదాయం, ఖర్చుల మధ్య పెద్ద వ్యత్యాసం ఉంటే మీకు ఐటీ నోటీసులు పంపుతుంది.
మీకు నోటీసు వస్తే ఏం చేయాలంటే? :
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందినంత మాత్రాన మీకు వెంటనే జరిమానా పడినట్టు కాదు. మీరు ఏ సోర్స్ నుంచి అంత ఖర్చు చేశారో నిరూపించాల్సి ఉంటుంది. జీతం నుంచి ఖర్చు చేశారా? సేవింగ్స్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టారా? లేదా ఏదైనా గిఫ్ట్స్ ద్వారా డబ్బు అందుకున్నారా అనేది ఐటీ శాఖకు స్పష్టం చేయాలి. మీరు సరైన సమాధానం ఇవ్వలేకపోతే ఐటీ శాఖ పన్ను చెల్లించడమనడం లేదా జరిమానా కూడా విధించవచ్చు.
ఏయే మిస్టేక్స్ చేయొద్దంటే? :
క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎల్లప్పుడూ డిజిటల్ ద్వారా పేమెంట్ చేయండి. ఉదాహరణకు UPI, నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా చేయండి. క్యాష్ పేమెంట్లు అసలు చేయొద్దు. అలాగే, ITR దాఖలు చేసేటప్పుడు మీ ఆదాయం, ప్రధాన ఖర్చుల పూర్తి వివరాలను సరిగ్గా తెలియజేయండి.
మీరు ఒక నిర్దిష్ట సంవత్సరంలో కొనుగోలు లేదా పెట్టుబడులు ఉంటే వాటి మూలాన్ని స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఐటీ నోటీసులను రాకుండా నివారించవచ్చు.