Government Schemes : మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలివే.. ఇలా పెట్టుబడి పెట్టారంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు..!

Government Schemes : మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక అద్భుతమైన పథకాలను అందిస్తోంది. భవిష్యత్తులో లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

Government Schemes : మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలివే.. ఇలా పెట్టుబడి పెట్టారంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు..!

Government Schemes

Updated On : August 19, 2025 / 8:46 PM IST

Government Schemes : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ప్రత్యేకించి మహిళలు కోసం అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. నేడు మహిళలు (Government Schemes) ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతున్నారు.

అందుకే మహిళలు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. స్కూల్లో చదివే బాలికల దగ్గర నుంచి మహిళల కోసం అందరూ ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు.

ప్రస్తుతం కేంద్రం అందించే పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన, సుభద్ర పథకం, మాఝి లాడ్లి బహిన్ యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్, NSIGSE స్కీమ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ పథకంలో పెట్టబడి పెట్టిన అద్భుతమైన రాబడిని పొందవచ్చు.

భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయాలని ఆలోచిస్తున్న వారికి ఈ పథకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కింద పేర్కొన్న ఏవైనా పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మహిళలు లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

Government Schemes : మహిళల కోసం 5 బెస్ట్ పథకాలివే :

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మహిళల కోసం 5 అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బు ఎక్కడ పోతుందనే భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఈ పథకాలన్నీ ప్రభుత్వమే అందిస్తోంది. ఏయే పథకాల్లో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Read Also : 6 Camera Phones : కొంటే ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కన్నా ఈ 6 కెమెరా ఫోన్లు తోపు అంతే..!

1. సుకన్య సమృద్ధి యోజన :
సుకన్య సమృద్ధి యోజన అనే పథకం బాగా పాపులర్. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం బేటీ బచావో బేటీ పఢావో పథకంలో భాగం. ఈ పథకం కింద మీరు 8.2 శాతం వరకు వార్షిక రాబడిని పొందవచ్చు.

అంతేకాదు.. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. మీరు కేవలం రూ. 250 పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో మీ డబ్బు 14 ఏళ్ల పాటు డిపాజిట్ చేయొచ్చు.

2. సుభద్ర పథకం :
ఈ పథకం ప్రత్యేకంగా ఒడిశాలో నివసిస్తున్న మహిళల కోసం ప్రారంభించింది. 21 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒడిశా మహిళలను ఆర్థికంగా సాధికారపరచడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద 5 ఏళ్లలో రూ. 50వేలు ఆర్థిక సాయం పొందవచ్చు.

3. మాఝి లాడ్లి బహిన్ యోజన :
ఈ పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తీసుకొచ్చింది. 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు ఈ పథకానికి అప్లయ్ చేయొచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారునికి ప్రతి నెలా రూ. 1500 చొప్పున అందిస్తారు. మహిళలను ఆర్థికంగా స్వతంత్రులుగా చేయడమే ఈ పథకం లక్ష్యం. అయితే, వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించని మహిళలు మాత్రమే ఈ పథకం నుంచి ఆర్థిక సాయాన్ని పొందగలరు.

4. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ :

ఈ పథకం 2023లో ప్రారంభమైంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు 7.5 శాతం రాబడిని పొందవచ్చు.

5. NSIGSE స్కీమ్ :
అంతేకాదు.. NSIGSE స్కూల్ బాలికలకు అద్భుతమైన స్కీమ్.. ఈ పథకం కింద పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 3వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీరు ఏదైనా పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత ఆర్థిక నిపుణులను సంప్రదించండి.