ITR Filing 2026 : టాక్స్ పేయర్ల కోసం కొత్త రూల్స్.. ఈ 6 కేటగిరీల్లో మీ రిటర్న్స్ ఉంటే ఇన్‌కమ్ టాక్స్ శాఖ ప్రత్యేక నిఘా!

ITR Filing 2026 : ఐటీఆర్ ఫైలింగ్ సంబంధించి సీబీడీటీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ రిస్క్ కేటగిరీలో మీ ఐటీఆర్ ఉంటే ఐటీశాఖ ప్రత్యేకించి నిఘా పెట్టే అవకాశం ఉంది..

ITR Filing 2026

  • పన్ను చెల్లింపుదారుల కోసం CBDT కొత్త మార్గదర్శకాలు జారీ
  • ఐటీఆర్ విషయంలో ఇక నుంచి మరింత జాగ్రత్తలు తప్పనిసరి
  • ఈ రిస్క్ కేటగిరీల్లో మీ ఐటీఆర్ ఉంటే ఐటీ శాఖ నిఘాలో ఉన్నట్టే

ITR Filing 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదా ఇప్పుడే చేయబోతున్నారా? అయితే జర జాగ్రత్త.. ఐటీ నిఘా నుంచి ఇప్పుడు తప్పించుకోలేరు. ఎలాంటి తప్పుడు వివరాలను సమర్పించినా లేదా ఆదాయం విషయంలో గతంలో మీకు ఎలాంటి నోటీసులు అందినా మీరు ఆదాయపు పన్ను శాఖ నిఘాలో ఉన్నట్టే.. మీరు ఐటీఆర్ సరిగా ఫైల్ చేసినా కూడా మీ వివరాలపై ఏ కొంచెం అనుమానం వచ్చినా ఐటీ శాఖ లోతుగా పరిశీలించే అవకాశం ఉంది.

2025–26 ఆర్థిక సంవత్సరం (AY 2026–27)కి సంబంధించి సీబీడీటీ కొత్త స్క్రూటినీ మార్గదర్శకాలను (ITR Filing 2026) విడుదల చేసింది. అంటే.. ఇకపై ప్రతి ఐటీఆర్ ఎప్పటిలా కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ల ఆధారంగా ఎంపిక చేసి పరిశీలించే అవకాశం ఉంది.

భారీ మొత్తంలో క్యాష్ డిపాజిట్లు కావొచ్చు.. ఆదాయం, ఖర్చుల మధ్య తేడాలు కావొచ్చు, AIS/26ASలో తేడాలు లేదంటే అనుమానాస్పద లావాదేవీల ఐటీ రిటర్న్‌లు ఇలా ఏదైనా కావొచ్చు.. ఇలాంటి ఐటీఆర్ అప్లికేషన్లపై ఐటీ శాఖ ప్రత్యేకంగా చెక్ చేయనుంది.

వాస్తవానికి, అన్ని సరిగా ఫైల్ చేసిన ఐటీ రిటర్న్‌లు ఫాస్ట్ ప్రాసెస్ అవుతాయి. కానీ, మీ ఐటీఆర్ పై గతంలో ఏదైనా అనుమానాస్పద అంశాలతో లింక్ ఉంటే మాత్రం కచ్చితంగా స్క్రూటినీ పెరుగుతుంది. ఇలా ఎందుకంటే.. తప్పులు, తప్పుదోవ పట్టించే వివరాలను ముందుగానే గుర్తించి పన్ను పారదర్శకతను పెంచడమే దీని ఉద్దేశంగా చెప్పొచ్చు. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసే టైంలో అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా మంచిది.

ఎవరి ఐటీఆర్ మళ్లీ ఐటీ శాఖ పరిశీలనలోకి వెళ్లొచ్చంటే? :

1. ఆదాయపు పన్ను సర్వే :
2024 ఏప్రిల్ 1 తర్వాత సెక్షన్ 133A కింద మీ బిజినెస్ లేదా ఆఫీసులో ఏదైనా రైడ్ జరిగి ఉన్నా మీ ఐటీఆర్ పూర్తి పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది.

2. సోదాలు జరిగినవాళ్లు :
2024 ఏప్రిల్ 1 తర్వాత ఆదాయపు పన్ను శాఖ మీ ఆదాయంపై సోదాలు చేయడం లేదా ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకుంటే అలాంటి వాళ్లు చేసిన ఐటీ రిటర్న్‌ కూడా క్షుణ్ణంగా చెక్ చేసే అవకాశం ఉంది.

3. రీఅసెస్‌మెంట్ నోటీసులు :
ఎవరైనా టాక్స్ పేయర్ తమ ఆదాయం దాచినట్లు ఐటీ శాఖకు అనుమానంగా ఉంటే సెక్షన్ 148 కింద రీఅసెసె మెంట్ (Reassessment) నోటీసు జారీ చేసినా కూడా మీ కేసు మళ్లీ ఐటీ పరిశీలనకు వెళ్లవచ్చు.

4. పన్ను మినహాయింపు హక్కు కోల్పోతే.. :
సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు ఏదైనా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రిజిస్ట్రేషన్ ఆమోదం రద్దు కావడం లేదా రిజెక్ట్ అయిన సమయంలో పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేస్తే అలాంటి సంస్థలు తప్పనిసరిగా మళ్లీ ఐటీ నిఘాలోకి వెళతాయి.

Read Also : PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ 23వ విడతపై ఉత్కంఠ.. జూన్ 18న రూ.2 వేలు పడతాయా? అసలు నిజం ఇదే!

5. గతంలో భారీ ఆదాయపు చేర్పులుంటే :
గత అసెస్‌మెంట్‌లలో ఒకే అంశంపై భారీ మొత్తంలో ఆదాయపు చేర్పులు జరిగి ఐటీ శాఖ లేదా అప్పీల్ స్థాయిలో పెండింగ్ ఉంటే మీ ఐటీఆర్ మళ్లీ పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంది.

ఆదాయపు చేర్పుల పరిమితి  :
ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రూ.50 లక్షలకు పైగా ఆదాయపు చేర్పులు, అలాగే, ఇతర ప్రాంతాల్లో రూ.20 లక్షలకు పైగా చేర్పులు ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది.

6. పన్ను ఎగవేత అనుమానితులు :
సాధారణంగా ఐటీశాఖకు ఇతర ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల నుంచి పన్ను ఎగవేతకు సంబంధించి క్లియర్ డేటా అందితేనే అలాంటి టాక్స్ పేయర్ల ఐటీఆర్‌లను పరిశీలనకు పంపే అవకాశం ఉంటుంది.

ఎవరు భయపడక్కర్లేదంటే? :
AIS, SFT, TDS లేదంటే.. ఇతర ఆర్థిక డేటాలో ఏమైనా చిన్నచిన్న తప్పులు ఉండి సాధారణ ఐటీ నోటీసులకు కూడా స్పందించి ఐటీఆర్ దాఖలు చేసినా మీ ఐటీ రిటర్న్ ఆటోమేటిక్‌గా స్క్రూటినీకి వెళ్లదు. పైన సూచించిన 6 రిస్క్ కేటగిరీల్లో ఏదైనా ఒకదానికి చెందితే మాత్రమే మీ ఐటీఆర్ తప్పనిసరి పరిశీలనకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

ఇవి తప్పక గుర్తుంచుకోండి :
ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రతి టాక్స్ పేయర్ ఐటీ రిటర్న్‌ను ఐటీ శాఖ చెక్ చేయదు. కానీ, రైడ్లు, సర్వేలు, రీఅసెస్‌మెంట్‌లు, భారీ పన్ను చేర్పులు లేదంటే పన్ను ఎగవేత అనుమానితుల కేసులపై మాత్రం ఈసారి సీబీడీటీ స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. అందుకే ఐటీఆర్ దాఖలు చేసే ముందు మీకు సంబంధించి ఖర్చులు, ఆదాయాలు, మినహాయింపులు, పన్ను వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బెటర్.