AJIO Sale: ఫ్యాషన్ సేల్‌లో భాగంగా 50-90శాతం డిస్కౌంట్స్‌తో అజియో

కొత్త స్టైల్స్, అద్భుతమైన ట్రెండింగ్ ఫ్యాషన్‌తో AJIO సరికొత్త ఫ్యాషన్‌ సేల్ – బిగ్‌ బోల్డ్‌ సేల్‌ను సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 4, 2021 వరకు నిర్వహించనుంది.

Ajio Sale

AJIO Sale: కొత్త స్టైల్స్, అద్భుతమైన ట్రెండింగ్ ఫ్యాషన్‌తో AJIO సరికొత్త ఫ్యాషన్‌ సేల్ – బిగ్‌ బోల్డ్‌ సేల్‌ను సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 4, 2021 వరకు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇప్పటి వరకు వినని తగ్గింపు ధరలు, ప్రతీ గంటకు ఫ్లాష్‌ డీల్స్, కచ్చితమైన బహుమతులు, రివార్డులు, పాయింట్లు ఇలా టెంప్టింగ్ ఆఫర్లతో ఊరించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సేల్‌ ఈవెంట్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా 30 సెకన్ల పాటు GAS ఉచితం, 60 సెకన్లలో సమాప్తం పేరుతో ఫ్లాష్‌ డీల్స్‌ను అజియో నిర్వహిస్తోంది. మెగా ఈవెంట్‌తో ఫ్యాషన్‌ సెలబ్రిటీలు సోనమ్‌ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో పాటు గురు రణధావా, శృతి హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌, మౌనిరాయ్‌, ప్రతీక్‌ గాంధీలతో కొత్త ఫొటో షూట్ నిర్వహించారు.

ఈ పండగ సీజన్‌ బిగ్‌ బోల్డ్ సేల్‌ సందర్బంగా కొనుగోలుదారులు పండగ అవసరాలు, కుటుంబసభ్యులు, స్నేహితులు ఇంటి కోసం షాపింగ్ లాంటివి చేస్తారని భావిస్తున్నారు. టీ-షర్టులు, జీన్స్, స్నీకర్స్ వంటి చక్కని బహుమతుల శ్రేణి సహ విస్తృతస్థాయి కేటలాగ్‌ను అజియో 50 నుంచి 90% వరకు తగ్గింపు ధరల్లో అందిస్తోంది.

…………………………………. : భారత్-అప్ఘానిస్తాన్ మధ్య విమాన సర్వీసులు..DGCAకి తాలిబన్ లేఖ

ధరలు మాత్రమే కాదు ఈ సేల్‌ సందర్బంగా అనేక ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ను కూడా అజియో ప్రవేశపెడుతోంది. దేశంలోని ఫ్యాషన్‌ ప్రియుల కోసం గొప్ప వేదిక అజియో, ఇది పురుషులు, స్త్రీల కోసం ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్ అందిస్తోంది.