Taliban : భారత్-అప్ఘానిస్తాన్ మధ్య విమాన సర్వీసులు..DGCAకి తాలిబన్ లేఖ

అఫ్ఘానిస్తాన్‌ కు కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్ఘాన్‌ పౌరవిమానయాన శాఖ.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్

Taliban : భారత్-అప్ఘానిస్తాన్ మధ్య విమాన సర్వీసులు..DGCAకి తాలిబన్ లేఖ

Afghan (13) (1)

Taliban  అఫ్ఘానిస్తాన్‌ కు కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్ఘాన్‌ పౌరవిమానయాన శాఖ.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్(డీజీసీఏ)కు లేఖ రాసింది. ఆగస్టు-15,20121న తాలిబన్లు కాబూల్ సిటీలోకి ప్రవేశించడంతో ఆదేశానికి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ అప్ఘాన్-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని,ఇరు దేశాల మధ్య ప్రయాణికుల సంచారం సజావుగా జరగాలనే ఉద్దేశంతో డీజీసీఐకి లేఖను రాసినట్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ తెలిపింది.

లేఖలో డీజీసీఏ కి తన అభినందనలు తెలిపిన తర్వాత ఇటీవల అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి వెళ్లేముందు కాబూల్ విమానాశ్రయం దెబ్బతిందని పేర్కొన్నారు. అప్పటినుండి కాబూల్ విమానాశ్రయం కార్యకలాపాలను కొనసాగించలేదని, అప్పటి నుండి విమానయాన సర్వీసులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. తమ సోదర దేశమైన ఖతార్ సాంకేతిక సహాయంతో, విమానాశ్రయం మరోసారి పునరుద్ధరించబడిందని స్పష్టం చేశారు.ఎయిర్ పోర్టులో కార్యకలాపాలను ప్రారంభించే విషయమై ఇప్పటికే విమానయాన సంస్థలకు నోటీసులు పంపించామని,భారత్-అఫ్ఘానిస్తాన్ దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకలు సాగాలని, కమర్షియల్ విమానాల సేవలను కూడా పునరుద్ధరించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ క్యారియర్స్ (అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్) తమ షెడ్యూల్డు ఫ్లైట్స్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నాయని తెలిపింది. కాగా, తాలిబన్ల సర్కార్ భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు సమాచారం.