Insta-Facebook Teen : మెటా సంచలనం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా వాళ్లకు రోజుకు 2 గంటలే..!

Insta-Facebook Teen : పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా భద్రతపై అమెరికాలో భారీ ఒప్పందం కుదిరింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై 2 గంటల డైలీ లిమిట్, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు నిషేధం వంటి కీలక మార్పులు రానున్నాయి.

Insta-Facebook Teen

  • టీనేజర్ల సోషల్ మీడియా వాడకంపై మెటా కీలక నిర్ణయం
  • అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు నో యూజ్
  • టీనేజర్ల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ మార్పులు

Insta-Facebook Teen : టీనేజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. సోషల్ మీడియా యాప్స్ ఎలా పడితే అలా వాడేస్తామంటే ఇక కుదరదు.. గంటల తరబడి సోషల్ మీడియా చూడలేరు.. టీనేజర్ల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. పిల్లలు, టీనేజర్ల ప్రైవసీపరంగా సోషల్ మీడియా వాడకంపై మెటా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు 2 గంటలే పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా అర్ధరాత్రి 12గంటల నుంచి ఉదయం 6 వరకు సోషల్ మీడియా పనిచేయదు. అమెరికాలో పిల్లలు, టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించేందుకు భారీ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు మార్పులు రానున్నాయి.

ముఖ్యంగా 18 ఏళ్లలోపు యూజర్లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కలిపి రోజుకు 2 గంటల డిఫాల్ట్ లిమిట్ ఉండనుంది. అంతకన్నా ఎక్కువ సమయం యాప్‌లలో గడపాలంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. అంటే 2 యాప్‌లను వేర్వేరుగా కాకుండా, అందులో ఎంతసేపు చూశారు? మొత్తం టైమ్ కలిపి ఇందులో లెక్కించనున్నారు.

అర్థరాత్రి వినియోగంపై నిషేధం :

ఇక టీనేజర్లు రాత్రి సోషల్ మీడియా వినియోగంపైనా కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులో ఉండవు. అలాగే, స్కూల్ సమయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నోటిఫికేషన్లు డిఫాల్ట్‌గా మ్యూట్ అవుతాయి. అయితే, డైరెక్ట్ మెసేజ్‌లు, ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్స్ మాత్రం కొనసాగుతాయి.

Read Also : AP Employees Protest : ఏపీ ఉద్యోగుల ఉద్యమానికి డేట్ ఫిక్స్.. 3 దశల్లో పోరాటం, ‘ సీఎం సారూ.. మా డబ్బులు మాకివ్వండి’!

ఇక రిమైండర్లు కనిపిస్తాయి :
టీనేజర్లు గంటల తరబడి అదేపనిగా యాప్‌లు వాడకుండా బ్రేక్ తీసుకోవాలని రిమైండర్లు కూడా చూపించనున్నారు. వయస్సు నిర్ధారణ, పేరెంట్స్ కంట్రోలింగ్, డేంజరస్ కంటెంట్ నుంచి ప్రొటెక్షన్ వంటి అంశాల్లోనూ మార్పులు ప్రతిపాదించారు. కొన్ని బ్యూటీ ఫిల్టర్లు, పబ్లిక్ లైక్ కౌంట్లపై కూడా లిమిట్స్ ఉండొచ్చు.

18 బిలియన్ డాలర్లకు ఒప్పందం :
29 అమెరికా రాష్ట్రాల నుంచి ఎదురైన దావాలను పరిష్కరించేందుకు మెటా 18 బిలియన్ డాలర్ల వరకు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం కింద మెటా భారీ మొత్తాన్ని చెల్లించనుంది. ఈ మొత్తాన్ని 10 ఏళ్లలో చెల్లించనుంది.

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను రూపొందించారని, పిల్లల ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించిందని అనేక రాష్ట్రాలు ఆరోపించాయి. అయితే, సెటిల్‌మెంట్‌లో మెటా ఎలాంటి తప్పును అంగీకరించలేదు.

మరోవైపు.. మెటా నిబంధనలు పాటిస్తుందో లేదో ఐదేళ్ల పాటు ఇండిపెండెంట్ ఆడిటర్ పరిశీలిస్తారు. మరోవైపు టిక్‌టాక్, యూట్యూబ్ కూడా ఇలాంటి సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలని మెటా కోరుతోంది. సెటిల్‌మెంట్‌లో దాదాపు 30 శాతం, అంటే 5.3 బిలియన్ డాలర్లు. అయితే, ఈ 2 ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేదానిపై ఆధారపడి ఉంటుంది.