Insurance Claim : కారు, బైక్‌కు ప్రమాదమా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎన్నిరోజుల్లోగా చేయాలి? ఆలస్యం చేస్తే భారీగా నష్టం!

Insurance Claim : కారు లేదా బైక్ ప్రమాదం తర్వాత బీమా క్లెయిమ్ దాఖలుకు టైమ్ పీరియడ్ ఉంటుంది. బీమా కంపెనీకి ప్రమాద విషయాన్ని ఎన్ని రోజుల్లోగా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. లేదంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.

Insurance Claim After an Accident

  • కారు లేదా బైకు ప్రమాదం జరిగితే వెంటనే ఇలా చేయండి
  • ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆలస్యం చేస్తే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయినట్టే
  • ఎన్నిరోజుల్లోగా బీమా కవరేజీ కోసం అప్లయ్ చేయాలి

Insurance Claim : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం కూడా తీరిక లేని రోజులివి.. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకదానికోసం తెగ ఆరాటపడిపోతుంటారు. ఎక్కడ ఆలస్యమవుతోందనని టెన్షన్ పడుతూ వేగంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది కార్లు లేదా బైకులను అతివేగంగా నడుపుతుంటారు.

ఫలితంగా, తరచుగా రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నారు. భారత్‌లో రోడ్డుప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదం జరిగిన (Insurance Claim) తర్వాత ఫస్ట్ ప్రయారిటీ మన సేఫ్టీ.. ఆ తర్వాత వాహనం సేఫ్టీ గురించి ఆలోచించాలి. ఈ హడావిడిలో చాలా మంది ఒక ముఖ్యమైన పనిని మరిచిపోతున్నారు. అదే.. బీమా కంపెనీకి వెంటనే తెలియజేయాలనే విషయం..

అందరూ చేసే తప్పు ఇదే :
దాదాపు ఎక్కువమంది చేసే మిస్టేక్ ఇక్కడే.. కారు ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి చెప్పరు. క్లెయిమ్ తర్వాత చేద్దాంలే అనుకుని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఇలా చేస్తే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే.. ప్రతి బీమా పాలసీలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం సూచించిన టైంలోగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన ఎన్నిరోజుల తర్వాత బీమా క్లెయిమ్ దాఖలు చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Upcoming Phones : కొత్త ఫోన్ కావాలా? జూలైలో రాబోయే టాప్ 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నథింగ్ నుంచి ఒప్పో రెనో వరకు..!

24 నుంచి 72 గంటల్లో క్లెయిమ్ చేయాలి :
చాలావరకూ మెయిన్ ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా ప్రమాదం తర్వాత 24 గంటల నుంచి 72 గంటల (ఒక రోజు నుంచి 3 రోజుల) క్లెయిమ్ నోటిఫికేషన్ వ్యవధిని అందిస్తాయని గమనించాలి. పాలసీ నిబంధనలలో ఈ టైమ్ లిమిట్ సమాచారం (ఇంటిమేషన్ పీరియడ్) చాలా ముఖ్యం.

ప్రమాదం చిన్నదైనా, పెద్దదైనా, మీరు కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం లేదా వారి వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా ఈ టైమ్ పీరియడ్ లోగా ప్రమాదం గురించి తెలియజేయాలి. ఈ గడువు తర్వాత మీరు కంపెనీని సంప్రదిస్తే.. ఆలస్యానికి గల సరైన కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. లేదంటే కంపెనీ మీ క్లెయిమ్‌ను ఆలస్యం చేయొచ్చు లేదంటే రిజెక్ట్ చేయొచ్చు.

ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు :
కారు ప్రమాదం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. క్లెయిమ్ కోసం కొన్ని ముఖ్యమైన అంశాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు.. ప్రమాద సంఘటనా స్థలం, వాహనానికి జరిగిన నష్టం, ఆయా ఫొటోలు, వీడియోలు దగ్గర పెట్టుకోండి. కంపెనీ సర్వేయర్ వచ్చేలోపు మీ వాహనానికి లోకల్ గ్యారేజీలో రిపేర్లు చేయించకూడదు.

ఎందుకంటే కంపెనీ మీ వాహనం నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయలేరు. అలాగే, క్లెయిమ్ ఫారం నింపేటప్పుడు ప్రమాదం గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వండి. మీరు సమాచారాన్ని దాచిపెట్టారని లేదా తప్పుడు సమాచారం ఇచ్చారని కంపెనీ అనుమానిస్తే మీరు సకాలంలో అప్లయ్ చేసినా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.