Central Bank FD : సెంట్రల్ బ్యాంక్‌లో 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుంది? సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఇవేనా?
Central Bank FD : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్‌డీ అకౌంట్ ఉందా? 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? పూర్తి లెక్కలివే..
- Sreehari A
- Published on- August 16, 2026 / 08:25 PM IST
Central Bank FD
- సెంట్రల్ బ్యాంక్‌లో 24 నెలల FDపై భారీ వడ్డీ రేట్లు
- సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఏంటి?
- 24 నెలల ఎఫ్‌డీలపై 6.25 శాతం నుంచి 6.75శాతం
Central Bank FD : మీకు ఈ బ్యాంకులో ఎఫ్‌డీ ఓపెన్ చేశారా? అయితే, ఇది మీకోసమే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలావరకూ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై భారీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా FD ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.
ఈ బ్యాంకులో కనీసం 7 రోజుల కాలపరిమితితో ఎఫ్‌డీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. మీరు ఎక్కువ కాలం పాటు ఎఫ్‌డీ ఖాతాను కొనసాగించాలని భావిస్తే.. ఖాతాదారులు గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీ తెరవచ్చు. ఈ బ్యాంకులో 24 నెలల ఎఫ్‌డీపై ఎంత వడ్డీని అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
24 నెలల ఎఫ్‌డీ పథకంపై వడ్డీ ఎంతంటే? :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు 24 నెలల ఎఫ్‌డీలపై 6.25 శాతం నుంచి 6.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కస్టమర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 నెలల ( 2 సంవత్సరాల) FD ఖాతాలపై 6.25శాతం వడ్డీని అందిస్తోంది.
Read Also : UCO Bank FD Returns : ఈ బ్యాంకు కస్టమర్లకు పండగే.. 444 రోజుల FDలపై అత్యధిక వడ్డీ రేట్లు.. రాబడి ఎంతంటే?
60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 24 నెలల ఎఫ్‌డీలపై 6.75శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.
సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఏంటి? :
అన్ని బ్యాంకులాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు FD ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తోంది. అయితే, 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రమే, నాన్-కాల్ ఖాతాలపై ఈ బ్యాంకు అదనపు వడ్డీని అందిస్తుంది. ఈ బ్యాంకు FD పథకాల వడ్డీ రేట్లను చివరిసారిగా ఆగస్టు 10, 2026న సవరించింది.
FD వడ్డీ రేట్లపై రెపో రేటు ఎఫెక్ట్? :
ఆర్బీఐ వరుసగా నాలుగోసారి రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బిఐ చివరిసారిగా 2025 డిసెంబర్‌లో రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించి 5.25 శాతానికి చేర్చింది.
రెపో రేటును తగ్గించడంతో లోన్ వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు రెండూ తగ్గుతాయి. అలాగే, రెపో రేటును పెంచడం వల్ల రుణ వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రెండూ పెరుగుతాయి.
