iPhones Price : లిమిటెడ్ ఆఫర్ బ్రో.. ఈ రెండు ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

iPhones Price : ఆపిల్ ఐఫోన్ కావాలా భయ్యా.. ఐఫోన్ 15, ఐఫోన్ 16 రెండు ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhones Price

iPhones Price : కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఆపిల్ ఐఫోన్ 15, లేటెస్ట్ ఐఫోన్ 16 రెండూ ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లతో ఐఫోన్ ధరలు రికార్డు స్థాయికి తగ్గాయి.

Read Also : Jio Annual Plan : జియో బంపర్ ఆఫర్.. ఈ రీచార్జ్ ప్లాన్‌తో 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ కాల్స్, OTT బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ ధరలపై మరింత తగ్గింపు పొందవచ్చు. అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్‌లతో కూడిన లేటెస్ట్ ఐఫోన్ కోసం చూస్తుంటే.. మీరు ఇప్పుడు ఈ రెండు ఐఫోన్ మోడళ్లపై భారీ మొత్తంలో డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.

రూ.60వేల లోపు ధరకే ఐఫోన్ 15 :
2023లో రూ.79,900కి లాంచ్ అయిన ఐఫోన్ 15, క్రోమాపై రూ.17,410 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందింది. ఐఫోన్ 15 ధర రూ.62,490కి తగ్గింది. యాక్సిస్, ఐసీఐసీఐ లేదా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. ఫైనల్ ఐఫోన్ ధర కేవలం రూ.59,490కి పొందవచ్చు.

ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను కలిగి ఉంటుంది. A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఐఫోన్ 14 ప్రోలో కనిపించే అదే ప్రాసెసర్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. USB-C ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించే ఫస్ట్ ఐఫోన్ కూడా ఇదే..

రూ.13,588 తగ్గిన ఐఫోన్ 16 :
లేటెస్ట్ ఐఫోన్ 16 అసలు ధర రూ.79,900 ఉండగా, ఇప్పుడు ఆపిల్ ప్రీమియం పార్టనర్ యూనికార్న్‌లో రూ.70,312కు లిస్టు అయింది. ఐసీఐసీఐ, కోటాక్ లేదా యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఐఫోన్ 16 ధర రూ.66,312కి తగ్గుతుంది.

Read Also : Realme GT 6T : రియల్‌మి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో చౌకైన ధరకే రియల్‌మి 5G ఫోన్ కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు..!

ఐఫోన్ 16లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, పవర్‌ఫుల్ A18 చిప్ ఉన్నాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు అందిస్తుంది. కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కలిగి ఉంది. విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఇందులో మరో హైలైట్. ఐఫోన్ కెమెరాలో ఈ ఫీచర్ పరిసరాలను స్కాన్ చేసి నేచురల్ లుక్ వచ్చేలా చేస్తుంది.