iPhone 15 Sale: ఐఫోన్ 15 అమ్మకాల జాతర.. ముంబై Apple స్టోర్ వెలుపల క్యూ కట్టిన కస్టమర్స్

తమకు ఇష్టమైన మోడల్ ను దక్కించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గంటల తరబడి Apple స్టోర్ ముందు నిలబడ్డారు.

iPhone 15 Sale

iPhone 15 Sale In India: ఇండియాలో లేటెస్ట్ ఐఫోన్ అమ్మకాల జాతర మొదలైంది. తాజాగా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐఫోన్ 15ను (iPhone 15) సొంతం చేసుకునేందుకు ఐఫోన్ ప్రేమికులు ముంబైలోని BKCలోని Apple స్టోర్ వెలుపల బారులు తీరారు. తమకు ఇష్టమైన మోడల్ ను దక్కించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గంటల తరబడి Apple స్టోర్ ముందు నిలబడ్డారు.

మేడిన్ ఇండియా ఐఫోన్ 15ను సొంతం చేసుకున్న వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ముంబైలోని BKCలోని Apple స్టోర్ వెలుపల ఉన్న వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. “నా కొత్త ఐఫోన్ 15 ప్రోని దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని బెంగళూరుకు చెందిన వివేక్ అనే వ్యక్తి ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

iPhone 15 Sale In India

మేడిన్ ఇండియా ఐఫోన్ 15ను దక్కించుకోవడానికి 17 గంటల పాటు క్యూలో వేచివున్నానని అహ్మదాబాద్ కు చెందిన వ్యక్తి ఒకరు తెలిపారు. ” నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను. భారతదేశపు మొట్టమొదటి Apple స్టోర్‌లో మొదటి iPhoneని పొందడానికి 17 గంటలపాటు క్యూలో వేచి ఉన్నాను. అహ్మదాబాద్ నుంచి వచ్చాను” అని తెలిపారు.

iPhone 15 Sale: అందుబాటులో ఐఫోన్ 15 ధరలు.. Pro Max తప్ప పెరగని ధరలు.. ఐఫోన్ లవర్స్ కు పండగే!

మేడిన్ ఇండియా ఐఫోన్ 15 కోసం అహ్మదాబాద్‌ నుంచి విమానంలో వచ్చినట్టు అయాన్ అనే వ్యక్తి తెలిపాడు. “విమానంలో ముంబై వచ్చాను. నేను ఇక్కడ 5-6 గంటలకు స్టోర్‌లో ఉన్నాను. నేను కొన్ని నెలల క్రితం స్టోర్ ఓపెనింగ్‌లో ఉన్నాను.. అక్కడ టిమ్ కుక్‌ను రెండవసారి కలిసే అదృష్టం నాకు కలిగింది” అంటూ పొంగిపోయాడు.

Also Read: ఐఫోన్ 15లో కొత్త బ్యాటరీ ఫీచర్.. మీ ఐఫోన్ బ్యాటరీని 80శాతం కన్నా ఛార్జ్ చేయలేరు.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు