iPhone 16 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై ఏకంగా రూ.16,500 డిస్కౌంట్.. ఇలా కొంటే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!
iPhone 16 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

iPhone 16 Discount
iPhone 16 Discount : ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ 2025 సందర్భంగా ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 16,500 కన్నా ఎక్కువ తగ్గింపుతో ఈ ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చ. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఇలాంటి డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. త్వరగా స్టాక్ అయిపోవచ్చు. మీరు ఐఫోన్ 16 తక్కువ ధరకు కొనాలని చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫర్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రూ.66,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 16పై రూ.12,901 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవ్ చేయాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 60hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2వేల నిట్‌ల గరిష్ట ప్రకాశం, సిరామిక్ షీల్డ్ గ్లాస్ లేయర్‌తో వస్తుంది. HDR డిస్‌ప్లే, ట్రూ టోన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 16 మోడల్ 3nm A18 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఈ ఐఫోన్ IP68 సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16లో 48MP ఫ్యూజన్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్, 12MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.