Train Ticket Booking: ట్రైన్ టికెట్ ఛార్జీలు పెరుగుతున్నాయా? యూపీఐ కొత్త రూల్స్‌తో ప్రయాణికుల్లో కలకలం.. అసలు నిజానిజాలు ఇవే!

రైల్వే టికెట్ల బుకింగ్‌తో(Train Ticket Booking) పాటు ఇతర అత్యవసర సేవల లావాదేవీలపై ఈ నిబంధన ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

IRCTC train ticket booking charges set to increase due to changes in UPI payment norms_

Train Ticket Booking: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అక్టోబర్ 15, 2026 నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Train Ticket Booking) విధించాలని నిర్ణయించారు. అయితే, రైల్వే టికెట్ల బుకింగ్‌తో పాటు ఇతర అత్యవసర సేవల లావాదేవీలపై ఈ నిబంధన ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ రుసుమును కేవలం వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు లేదా సాధారణ వినియోగదారుల ఖాతాల నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా కట్ కాదని అధికారులు స్పష్టం చేశారు.

Arunachalam Special Trains: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. టైమ్, రూట్, బుకింగ్ వివరాలు ఇవే!

రైల్వే టికెట్ బుకింగ్స్.. మర్చంట్లకు మాత్రమే ప్లాట్ రూ.5 ఫీజు:

సాధారణంగా వ్యాపార లావాదేవీలపై రూ.2,000 దాటితే 0.4 శాతం ఎండీఆర్ ఛార్జ్ అమలవుతుంది. కానీ ఇండియన్ రైల్వేస్ (IRCTC) అత్యవసర సేవ కిందకు వస్తుండటంతో, ఎంత పెద్ద మొత్తంలో టికెట్ బుక్ చేసినా గరిష్టంగా రూ.5 ప్లాట్ ఫీజు మాత్రమే మర్చంట్‌పై పడుతుంది. ఉదాహరణకు రూ.10,000 విలువైన రైలు టికెట్ బుక్ చేసినా మర్చంట్ రూ.5 మాత్రమే చెల్లించాలి. అదే సాధారణ దుకాణంలో అయితే రూ.40 వరకు పడుతుంది. ఈ రాయితీ రుసుము నిర్మాణం రైల్వేలతో పాటు ఇంధన కొనుగోళ్లు, టెలికాం బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇతర అత్యవసర సేవలకు కూడా వర్తిస్తుంది.

ప్రయాణికులకు ఉచిత సేవలు.. చిన్న లావాదేవీలపై సున్నా ఛార్జీలు:

రైల్వే నెట్‌వర్క్ వ్యాప్తంగా రోజువారీ వేలాది లావాదేవీలు జరుగుతుండటంతో వచ్చే ఈ ఫీజు భారాన్ని ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ, భాగస్వామ్య బ్యాంకులు కలసి పంచుకుంటాయి. చట్టబద్ధంగా ఈ వ్యయాన్ని ప్రయాణికులకు బదిలీ చేసే అవకాశం లేదు. మరోవైపు రూ.2,000 లోపు ఉండే చిన్న తరహా రోజువారీ యూపీఐ లావాదేవీలు గతంలో మాదిరిగానే పూర్తి ఉచితంగా కొనసాగుతాయి. కాబట్టి సాధారణ ప్రజలపై ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడకుండా డిజిటల్ చెల్లింపులు వేగవంతంగా సాగనున్నాయి.