Gold Rates : గోల్డ్‌పై BofA అలర్ట్.. రూ.1.10 లక్షల దిగువకు బంగారం? కొనేవారికి ఛాన్స్.. ఇన్వెస్టర్లకు టెన్షన్!

Gold Rates : బంగారం ధర భారీగా తగ్గబోతుందా? గోల్డ్ ధరలు రూ. 1.10 లక్షల కన్నా దిగువకు పడిపోయే అవకాశం ఉందా? అసలు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటోంది.. పూర్తి అంచనాల వివరాలివే..

Bank of America Gold Forecast

  • గోల్డ్‌పై బోఫా అలర్ట్.. ధరలు భారీగా పడిపోయే ఛాన్స్ ఉందా?
  • రూ.1.10 లక్షల కిందికి బంగారం? బ్యాంక్ ఆఫ్ అమెరికా సంచలన అంచనా
  • బంగారం ధరపై పెరుగుతున్న ఒత్తిడి.. అసలు కారణాలివే

Gold Rates : బంగారం ధరలు వరుసగా రెండో వారం ఒత్తిడిలో కొనసాగడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. ధరలు ఇంకాస్త తగ్గితే బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్ దొరికినట్టే. మరోవైపు ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టినవారు మాత్రం మార్కెట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ సమయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) సంచలన అంచనా భారీ చర్చకు దారితీసింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 4వేల డాలర్ల కన్నా దిగువకు రావచ్చని, సుమారు 3,750 డాలర్ల వరకు తగ్గొచ్చని బోఫా అంచనా వేసింది.

భారత్‌లో బంగారం ఎంత? :
అంతర్జాతీయంగా బంగారం ధర 3,750 డాలర్లకు వస్తే ప్రస్తుత డాలర్-రూపాయి మారకం (Gold Rates) విలువను బట్టి 10 గ్రాములకు సుమారు రూ.1.15 లక్షలు.. అయితే, భారత్‌లో మనం చెల్లించే అసలు ధర కాదు. రూపాయి విలువ, దిగుమతి ఖర్చులు, పన్నులు, దేశీయ డిమాండ్ వంటి అంశాల కారణంగా మార్కెట్ ధర మారుతుంది. కాబట్టి 3,750 డాలర్లు అంటే భారత్‌లో కచ్చితంగా రూ.1.15 లక్షలకే బంగారం వస్తుందని చెప్పలేం.

రూ.1.10 లక్షల కిందికి వెళ్లే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఎక్కువకాలం కొనసాగి, ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు వరకు పెరిగితే 2027లో బంగారం సగటు ధర ఔన్సుకు 3,500 డాలర్ల వరకు రావచ్చని బోఫా విశ్లేషించింది. 10 గ్రాములకు సుమారు రూ.1.08 లక్షలకు సమానంగా ఉండొచ్చు.

బోఫా అంచనా ఇదే :

బంగారం విషయంలో బోఫా గతంలో చాలా సానుకూలంగా ఉంది. జనవరిలో ఔన్సుకు 5వేల డాలర్ల వరకు బంగారం వెళ్లొచ్చని అంచనా వేసింది. ఆ ధర భారత కరెన్సీలో 10 గ్రాములకు సుమారు రూ.1.55 లక్షలకు సమానం. అయితే, 5వేల డాలర్ల స్థాయిని నిలబెట్టాలంటే పెట్టుబడిదారుల డిమాండ్ మరింత పెరగాలి.

జనవరి అంచనా ప్రకారం.. దాదాపు 14శాతం అదనపు పెట్టుబడి డిమాండ్ అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అంత స్థాయిలో డిమాండ్ పెరగడం కష్టమవచ్చని బోఫా చెబుతోంది. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి డిమాండ్ సుమారు 4వేల బంగారం ధరకు మద్దతు ఇస్తోందని పేర్కొంది.

Read Also : Gold-Silver Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. గోల్డ్ రేట్లలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

పెరుగుతున్న చమురు ధరలు కూడా మరో రిస్క్ అనే చెప్పాలి. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల కరెన్సీలు, ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరిగితే కొన్ని కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతుగా గోల్డ్ రిజర్వులను విక్రయించే అవకాశం ఉందని బోఫా చెబుతోంది.

రెండో త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు సుమారు 60 టన్నుల బంగారం విక్రయించగా, టర్కీ ఈ విక్రయాల్లో ముందుంది. మార్చిలో కూడా కేంద్ర బ్యాంకులు నికరంగా బంగారం విక్రయించాయి. ఈ విక్రయాలు పెరిగితే ధరలపై మరింత ఒత్తిడి రావచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి తీసుకున్నా అదే ప్రభావం ఉండొచ్చు.

కొనేవారికి అవకాశం.. ఇన్వెస్టర్లకు ఓపిక :
బంగారం ధరలు తగ్గితే పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా ఇతర అవసరాల కోసం కొనేవారికి నిజంగా ఊరటే. కానీ, రూ.1.10 లక్షల కిందికి తప్పకుండా వస్తుందని ఎదురుచూస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా రిస్క్. ఎందుకంటే.. బంగారం ధరను అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు డాలర్-రూపాయి మారకం, చమురు ధరలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు-అమ్మకాలు, ఈటీఎఫ్ పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి.

ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి మాత్రం స్వల్పకాలిక ధరల తగ్గుదల ఆందోళన కలిగించొచ్చు. అయితే, దీర్ఘకాల లక్ష్యంతో పెట్టుబడి పెట్టినవారు ఒక్కరోజు లేదా కొన్ని వారాల ధర మార్పును మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు. మొత్తానికి రూ.1.10 లక్షల కిందికి బంగారం వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ, ధరలు తగ్గితే కొనేవారికి అవకాశం.. ధరలు పడిపోతే ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారికి మాత్రం కొంత టెన్షన్ తప్పదు..