ITR 2025-26 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ITR ఫైలింగ్ ఓపెన్.. ఈసారి రీఫండ్ మిస్ అయితే మీరే బాధ్యులు..!
ITR 2025-26 : ఆదాయపు పన్ను శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2026-27) గాను ఐటీఆర్-1, ఐటీఆర్-4 కొరకు ఎక్సెల్ యుటిలిటీని లాంచ్ చేసింది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయొచ్చు.
- Sreehari A
- Published on- May 19, 2026 / 05:30 PM IST
ITR 2025-26 ITR Filling Dates
- ఐటీఆర్ ఫైలింగ్ చేసే టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్
- ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫైలింగ్ ప్రాసెస్ షురూ
- ఎవరెవరు ఈ ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చో తెలుసా?
- టీఆర్ దాఖలు చేసే ముందు ఫారం 16 కోసం వేచి ఉండాలి
ITR 2025-26 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. 2026 ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి భారీ అప్‌డేట్ వచ్చేసింది. ఆదాయపు పన్ను శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి (2026-27 అసెస్మెంట్ సంవత్సరం) ITR-1, ITR-4 కోసం ఎక్సెల్ యుటిలిటీలను రిలీజ్ చేసింది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయొచ్చు.
ఆన్‌లైన్ ఐటీఆర్ ఫైలింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా ఎక్సెల్ ఫార్మాట్ ద్వారా రిటర్న్‌లను రెడీ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఎక్సెల్ యుటిలిటీ ఆఫ్‌లైన్ టూల్ మాదిరిగా పనిచేస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఆదాయం, మినహాయింపులు, ఇతర వివరాలను రిజిస్టర్ చేయవచ్చు. ఆ తర్వాత సిస్టమ్ JSON ఫైల్‌ను జనరేట్ చేసి ఇస్తుంది. దీనిని వారి ఐటీఆర్ సబ్మిట్ చేసేందుకు ఆదాయపు పన్ను పోర్టల్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.
ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఎవరు దాఖలు చేయొచ్చు? :
జీతం, ఇల్లు, వడ్డీ లేదా ఇతర సాధారణ మార్గాల ద్వారా రూ. 50 లక్షల వరకు వార్షిక ఆదాయం సంపాదించే వ్యక్తుల కోసం ఐటీఆర్-1 సహజ్ పథకం అందుబాటులో ఉంది. ఇందులో రూ. 1.25 లక్షల వరకు లాంగ్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్, రూ.5వేల వరకు వ్యవసాయ ఆదాయం కూడా కలిపి లెక్కిస్తారు.
ఐటీఆర్-4 (సుగమ్) అనేది రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్న వ్యాపారాలు, వృత్తి నిపుణులు, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలు (HUFs), సంస్థల కోసం కేటాయించారు. ఈ వ్యక్తులు ఊహాత్మక పన్నుల పథకం పరిధిలోకి వస్తారు.
ఈ పథకం కింద చిన్న వ్యాపారాలు, వృత్తి నిపుణులు పూర్తి అకౌంటింగ్ రికార్డులను సమర్పించాల్సిన అవసరం లేకుండా నిర్ణీత శాతం ఆధారంగా పన్నులు చెల్లించవచ్చు.
తొందరపడొద్దు.. ఫారం 16 కోసం వెయిట్ చేయండి :
జీతగాళ్లలో టాక్స్ పేయర్లు ఎవరైనా తమ ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఫారం 16 కోసం వేచి ఉండాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీలు జూన్ 15 నాటికి ఫారం 16ను జారీ చేస్తాయి. ఇందులో టీడీఎస్, జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీని 31 జూలై 2026గా నిర్ణయించారు.
