ITR Filing Deadline : ఒకే రోజులో 10 లక్షల రిటర్న్‌లు! జూలై 31 వరకే ఛాన్స్.. మీ ITRను ఇప్పుడే ఫైల్ చేయండి!

ITR Filing Deadline : మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేశారా? జూలై 31 గడువు తేదీకి ముందే 17 మిలియన్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ITR దాఖలు చేశారు. చివరి నిమిషంలో పెనాల్టీలు పడకుండా ఉండాలంటే ఇప్పుడే చేయడం బెటర్.

ITR Filing Deadline

  • ఐటీ రిటర్న్ డెడ్ లైన్ జూలై 31 వరకు
  • ఒకే రోజులో 10 లక్షల రిటర్న్స్ దాఖలు
  • డెడ్ లైన్ వరకు వేచి ఉండొద్దని ఐటీశాఖ సూచన

ITR Filing Deadline : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ డెడ్ లైన్ దగ్గరపడుతోంది. మీరు ఇంకా ఐటీఆర్ ఫైలింగ్ చేయలేదా? ఇప్పుడే చేసుకోవడం బెటర్.. చివరి నిమిషంలో రిటర్న్స్ దాఖలు చేసి ఇబ్బందులు పడొద్దు.. ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్నులు) దాఖలు చేసేందుకు డెడ్ లైన్ జూలై 31, 2026 మాత్రమే..

దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను వేగంగా దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి (AY) ఇప్పటివరకు 1.7 కోట్లకు పైగా తమ ఐటీఆర్‌లను దాఖలు చేశారు.

చివరి నిమిషంలో ఉండే తొందరపాటు, వెబ్‌సైట్‌పై హై ట్రాఫిక్‌ను నివారించేందుకు వీలైనంత త్వరగా ఐటీఆర్ 1, ఐటీఆర్ 2లను దాఖలు చేయాలని పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ సూచిస్తోంది.

ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా రిటర్న్‌లు :
ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను శాఖ షేర్ చేసిన డేటా ప్రకారం.. ఐటీఆర్ ఫైలింగ్ చేసేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్క జూలై 10వ తేదీన మాత్రమే 10 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేశారు.

Read Also : Renault Kiger : కొత్త SUV కొంటున్నారా? ఈ రెనాల్ట్ కైగర్‌‌పై ఏకంగా రూ. 1.25 లక్షలు డిస్కౌంట్..!

డెడ్ లైన్ దగ్గరలో కంగారుపడి ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే తప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ముందే జాగ్రత్తగా తమ ఫైలింగ్ ప్రక్రియను ముందుగానే పూర్తి చేస్తున్నారని ఈ డేటా చెబుతోంది.

చివరి నిమిషంలో టెన్షన్ పడొద్దు :
ఐటీఆర్ గడువు తేదీ వరకు వేచి ఉండొద్దని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది. డెడ్ లైన్ సమయంలో పోర్టల్‌పై హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కువ మంది ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

కొన్నిసార్లు ఈ-ఫైలింగ్ సైట్ టెక్నికల్ సమస్యల కారణంగా నిలిచిపోవచ్చు. రిటర్న్ దాఖలులో ఆలస్యం అవ్వొచ్చు. అందుకే ముందుజాగ్రత్తగా లాస్ట్ డే వరకు ఉండకుండా ఇప్పుడే మీ ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫారమ్స్ సకాలంలో దాఖలు చేయండి.

ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? :
పన్ను నిపుణుల ప్రకారం.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం రిటర్న్ AY 2026-27 కొరకు, అంతేగానీ 2026-27 పన్ను సంవత్సరానికి కాదు. అంటే.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం ఈ రిటర్న్‌లో నివేదించాల్సి ఉంటుంది.