ITR Forms 2026 : బిగ్ బ్రేకింగ్.. ITR ఫారాల్లో కీలక మార్పులు.. టాక్స్ పేయర్లు ఎవరు ఏ ఫారమ్ నింపాలో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!

ITR Forms 2026 : 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారాలు విడుదల అయ్యాయి. ఈ ఐటీఆర్ ఫారాలు కీలక మార్పులతో అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఫైలింగ్ చేయాలి? అనేది వివరంగా తెలుసుకుందాం..

ITR Forms 2026

  • ఆదాయపు పన్ను ఐటీఆర్ ఫారాలు 2026-27 విడుదల
  • టాక్స్ పేయర్లు ఏయే ఫారాలను నింపాలో తెలుసా?
  • ఎవరెవరికి ఏయే ఫారాలు వర్తిసాయి? పూర్తి వివరాలు

ITR Forms 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ అప్‌డేట్.. ఆదాయపు పన్ను శాఖ 2026-27 అసెస్మెంట్ ఏడాదికి కొత్త ITR ఫారాలను విడుదల చేసింది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. జీతభత్యాలు పొందే వ్యక్తులు, పెన్షనర్లు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ITR-1, ITR-4 ఫారాలలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రెండు గృహ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రకటించవచ్చు. గతంలో, ఈ పరిమితి కేవలం ఒక ఆస్తికి మాత్రమే పరిమితంగా ఉండేది.

మీరు సెక్షన్ 80G లేదా 80GGC కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లావాదేవీ రిఫరెన్స్ నంబర్, సంబంధిత సంస్థ లేదా పార్టీ పేరు వంటి అదనపు సమాచారాన్ని అందిస్తుంది. మరో మార్పు ఏమిటంటే.. గతంలో జీతం బకాయిలపై రిలీఫ్ పొందిన సెక్షన్ 89Aను ITR-1, ITR-4 నుంచి తొలగించారు. క్యాపిటల్ గెయిన్స్ రిపోర్టింగ్‌ను ఈజీ కోసం పాత నిబంధనలను కూడా సవరించారు.

Read Also : HRA Tax Relief : జీతగాళ్లకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్ సహా 4 నగరాల్లో 50శాతం HRA.. చేతికి ఎంత జీతం వస్తుందంటే?

మీకు ఏ ITR ఫారం బెస్ట్? :
ITR-1 (సహజ్) అనేది జీతం, రెండు ఇళ్లు లేదా ఇతర సాధారణ వనరుల నుంచి వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారికి వర్తిస్తుంది.
ITR-2 అనేది మూలధన లాభాలు లేదా విదేశీ ఆస్తులు ఆదాయంలో కలిగిన వారికి బెటర్.
ITR-3 అనేది బిజినెస్ లేదా వృత్తి ద్వారా సంపాదించే వారి కోసం బెస్ట్
ITR-4 (సుగమ్) అనేది ఊహాత్మక పన్ను పథకం పరిధిలోకి వచ్చే చిన్న వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులకు బెస్ట్..

ఈ తప్పులు చేయొద్దు :
పన్ను నిపుణుల ప్రకారం.. AIS/TISలో చూపిన సమాచారానికి మీ ITRకు మధ్య ఎలాంటి తేడాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం నోటీసులు జారీ అవుతాయి. అంతేకాదు.. ముందుగానే మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయడం చాలా అవసరం. లేదంటే రీఫండ్‌లు ఆలస్యం కావచ్చు. ఇంకా, ఫైల్ చేసిన 30 రోజులలోపు మీ ITRను ఇ-వెరిఫై చేసుకోవడం తప్పనిసరి. లేదంటే ఆ రిటర్న్ చెల్లదు.