Jeep Meridian 85th Anniversary Edition : జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్ SUV వచ్చేసింది.. కేవలం 85 మందికే ఛాన్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
Jeep Meridian 85th Anniversary Edition : భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ 85వ వార్షికోత్సవ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు చెందిన 85 యూనిట్లు మాత్రమే దేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
Jeep Meridian 85th Anniversary Edition
- జీప్ మెరిడియన్ కొత్త ఎడిషన్ హైలైట్ ఇదే!
- 85 యూనిట్లతో జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్!
- స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లు, 85 మందికే అవకాశం
Jeep Meridian 85th Anniversary Edition : కొత్త SUV కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఆఫ్-రోడింగ్ ప్రీమియం SUV కార్లలో టాప్ మోడల్ జీప్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మెరిడియన్ SUV అరుదైన వెర్షన్ వచ్చేసింది.
బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ 85వ యానవర్సరీ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి దించింది. ఈ స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ టాప్-స్పెక్ లిమిటెడ్ వేరియంట్ ఆధారంగా రూపొందింది. కొత్త కాస్మెటిక్ మార్పులు, స్పెషల్ యాక్సెసరీలు సరికొత్త ఏఐ ఫీచర్‌తో కంపెనీ రూపొందించింది.
ఈ స్పెషల్ SUV ధర ఎంతంటే? :
జీప్ మెరిడియన్ 85వ యానవర్సరీ ఎడిషన్ ధర సుమారుగా రూ. 36.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ స్పెషల్ మోడల్ లిమిటెడ్ (O) వేరియంట్ ఆధారంగా రూపొందించారు. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ SUVని కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
భారత్‌లో ఎన్ని యూనిట్లంటే? :
ఈ జీప్ ఎడిషన్ భారత మార్కెట్లో కేవలం 85 యూనిట్లను మాత్రమే విక్రయిస్తుంది. మెరిడియన్ లైనప్‌లో అత్యంత అరుదైన మోడల్ అని చెప్పొచ్చు. 85వ యానవర్సరీ ఎడిషన్ కొనుగోలుదారులకు కొన్ని స్పెషల్ స్టైలింగ్ టెక్ ఫీచర్లను అందిస్తుంది.
ఎక్స్‌ట్రనల్ మార్పులు :
కారు బయటి భాగంలో స్పెషల్ 85వ వార్షికోత్సవ బ్యాడ్జింగ్, ప్రత్యేకమైన స్టైలింగ్ ఫీచర్లు, స్పెషల్ యాక్సెసరీ కిట్ ఉన్నాయి.
ప్రీమియం ఇంటీరియర్ :
క్యాబిన్ లోపల, యానవర్సరీ బ్రాండింగ్‌తో ప్రత్యేక సీట్ అప్హోల్స్టరీ ఉంది. స్టాండర్డ్ మోడల్ కన్నా చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది.
CARA AI- ఆధారిత వాయిస్ అసిస్టెంట్ :
ఈ ఎడిషన్‌లో జీప్ కొత్త CARA ఏఐ వాయిస్ అసిస్టెంట్ అత్యంత ఆకర్షణ. ఈ అడ్వాన్స్ ఫీచర్, డ్రైవర్లు కేవలం మాట్లాడటం ద్వారా (వాయిస్ కమాండ్లు) వాహనంలోని వివిధ ఫీచర్లను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.
ఇంజిన్ పర్ఫార్మెన్స్ :
ఈ స్పెషల్ ఎడిషన్ ఇంజన్లో ఎలాంటి మార్పు లేదు. ఇందులో 168bhp 350Nm టార్క్ ఉత్పత్తి చేసే అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్లో 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ కూడా ఉంది.
సేఫ్టీ ఫీచర్లు :
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ సేఫ్టీ విషయంలో కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ డిసెంట్ కంట్రోల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎంపిక చేసిన వేరియంట్లలో లెవెల్-2 అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా ఉంది.
