దంతే రష్ : కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కళకళ

  • Publish Date - October 25, 2019 / 03:54 AM IST

ధన త్రయోదశినే ధన్ తేరస్ అంటుంటారు. మార్వాడీలు కొత్త పద్దు పుస్తకాలకు లక్ష్మీ పూజ చేస్తారు. దీపావళి పర్వదినానికంటే ముందు వచ్చే ధన్ తేరస్‌ను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బంగారు ఆభరణాల దుకాణాల యజమానులు వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దీంతో ఒక రోజు ముందునుంచే షోరూంలన్నీ కళకళలాడుతున్నాయి. ఎంతో కొంత బంగారం కొనుక్కుని..లక్ష్మీ దేవి పూజ చేస్తే శుభం కలుగుతుందని నమ్మకం. అత్యధిక సంఖ్యలో బంగారం ఖరీదు చేస్తుంటారు.

బంగారం ధరలు ఆకాశాన్నంటినా వినియోగదారులు మాత్రం వెనుకడుగు వేయకుండా ధన్ తేరస్‌కు తప్పనిసరిగా బంగారాన్ని ఇంటికి తీసుకెళుతుంటారని వ్యాపారులు వెల్లడించారు. 
సకల సిరులకు, అష్టైశ్వర్యాలకు నవ నిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధన లక్ష్మీని ధన త్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఏడాది పొడవునా తమకు ధన లక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు రాగి, పంచలోహ పాత్రలను కొనుగోలు చేస్తారు. 

గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాన్ని విశేషంగా జరుపుకుంటుంటారు. సూర్యాస్తమయ సమయంలో, మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా యమ దీపాలుగా ఉంచుతారు. దానాలు, జపాలు, పూజలు చేస్తే అనేక ఉత్తమ ఫలితాలనిస్తాయని భక్తులు నమ్మతారు. 
Read More : ధన త్రయోదశి..భారీ ఆఫర్లు ప్రకటించిన వ్యాపారులు