Kia Discount Offers : కియా బంపర్ ఆఫర్.. సిట్రో నుంచి కార్నివాల్ వరకు.. ఈ కియా కార్లపై రూ.3.30 లక్షల డిస్కౌంట్!

Kia Discount Offers : కొత్త కియా కారు కొనాలని అనుకుంటున్నారా? ఏప్రిల్ 2026లో కంపెనీ ప్రముఖ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి..

Kia Discount Offers

  • మార్కెట్ షేక్ చేస్తున్న కియా ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు రెడీ
  • కియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. అన్ని మోడల్స్‌పై భారీ ఆఫర్లు..
  • సెల్టోస్, కార్నివాల్ పై కియా బిగ్ బ్లాస్ట్ ఆఫర్

Kia Discount Offers : కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. భారత మార్కెట్లో అనేక్ మోడల్ కార్లను అందిస్తోంది. కొత్త కియా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.

ఏప్రిల్ 2026లో కంపెనీ ప్రముఖ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో కియా కారు (Kia Discount Offers) కొనుగోలుపై మీరు రూ. 3.20 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏయే కియా కార్లపై ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కియా కార్నివాల్ :
కంపెనీ ప్రస్తుతం కియా కార్నివాల్ 2025 మోడల్ ఇయర్‌పై రూ. 3.20 లక్షల వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 50వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 2 లక్షల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. అదనంగా, 2026 మోడల్ ఇయర్‌పై రూ. లక్ష వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 7-సీటర్‌ కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.

Read Also : Whatsapp Recharge : వావ్.. సూపర్ ఫీచర్.. ఇక వాట్సాప్‌లో కూడా మొబైల్ రీఛార్జ్‌ చేయొచ్చు.. ఎలాగంటే?

కియా సెల్టోస్ :
ప్రముఖ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ 2025 మోడల్ ఇయర్‌పై ప్రస్తుతం రూ. 1.35 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ. 40వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 60వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20వేల స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

కియా సైరోస్ :
కియా సిరోస్‌ను కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే.. కంపెనీ ప్రస్తుతం కియా సిరోస్‌పై రూ. 1.55 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ. 70వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 50వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20వేల స్క్రాపేజ్ డిస్కౌంట్ ఉన్నాయి. 2026 మోడల్‌పై కేవలం రూ. 60వేల వరకు మాత్రమే డిస్కౌంట్లు లభిస్తాయి.

కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ :
మీరు కియా ఈవీ కొనుగోలు చేయాలనుకుంటే కియా కేరెన్స్ క్లావిస్ ఈవీని కొనేసుకోవచ్చు. ఈ ఈవీ కారుపై కంపెనీ ప్రస్తుతం రూ. 2.15 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ. 85వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 75వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 35వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ 2026 మోడల్ రూ. 90వేల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది.