Kia PV7 : కియా PV7 వచ్చేసింది.. ఫ్యామిలీ ట్రిప్స్‌కు కొత్త ఛాయిస్.. 11 మంది వెళ్లొచ్చు!..
Kia PV7 : కియా PV7 ఎలక్ట్రిక్ వ్యాన్ 11-సీటర్, కార్గో వెర్షన్లలో ఆవిష్కరించింది. 460km రేంజ్, 268hp పవర్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఆకట్టుకుంటోంది. పూర్తి ఆఫర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- September 17, 2026 / 06:28 PM IST
Kia reveals PV7
- అద్భుతమైన ఫీచర్లతో కియా PV7 ఎలక్ట్రిక్ వాన్
- 11 మంది కోసం ఒక్క ఎలక్ట్రిక్ వాన్.. ఇదే కియా PV7 స్పెషల్
- కియా PV7లో 11 మంది జర్నీ.. ఎలక్ట్రిక్ వాన్‌లో కొత్త రేంజ్
Kia PV7 : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కియా మరో అడుగు ముందుకేసింది. తన రెండో ఎలక్ట్రిక్ వ్యాన్‌గా PV7ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. ఇప్పటికే వచ్చిన PV5 కంటే పెద్దదైన ఈ కొత్త వ్యాన్‌ను ప్యాసింజర్, కార్గో వెర్షన్లలో తీసుకురానుంది.
ప్యాసింజర్ వెర్షన్‌లో మార్కెట్‌ను బట్టి 9 నుంచి 11 మంది వరకు ప్రయాణించవచ్చు. కొరియా (Kia PV7) మార్కెట్‌కు 11-సీటర్ వెర్షన్ పరిమితం కాగా, ఇతర మార్కెట్లలో 9 సీట్ల వరకు లభిస్తుంది. అదనంగా సీట్లు తొలగించుకునే 7-సీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. కార్గో వెర్షన్ 1,200 కిలోల వరకు పేలోడ్ మోయగలదు.
పవర్‌లోనూ తగ్గేదేలే :
PV7లో 71.5kWh, 96.2kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 268hp, 400Nm ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీతో WLTP ప్రకారం 460 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కియా చెబుతోంది. 350kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10-80 శాతం ఛార్జింగ్‌ను సుమారు 20 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. 800V E-GMP.S ఆర్కిటెక్చర్‌పై రూపొందిన PV7కు భవిష్యత్తులో డ్యూయల్-మోటార్ AWD వెర్షన్ కూడా రానుంది.
భారీ బాడీ.. ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు :
5,350mm పొడవు, 1,995mm వెడల్పు, 1,990mm ఎత్తు, 3,500mm వీల్‌బేస్‌తో PV7 భారీగా ఉంటుంది. ఇందులో 14.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, లెవల్ 2 అడాస్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 100W USB-C ఛార్జింగ్ పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా PV7ను 2027 ద్వితీయార్థంలో కొరియా, యూరప్ మార్కెట్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత ఇతర మార్కెట్లకు విస్తరించనుంది.
