March Car Discounts : కియా బంపర్ ఆఫర్.. మార్చిలో ఈ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనండి

March Car Discounts : కియా కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ మార్చి 2026లో రూ. 50వేల లోపు ధరలో కియా సోనెట్, కియా సెల్టోస్ అనే మోడల్ కార్లు ఉన్నాయి. పూర్తి వివరాలివే..

March Car Discounts

  • 2026లో మార్చిలో కియా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు
  • కియా సోనెట్, కియా సెల్టోస్ మోడల్స్ ధర తగ్గింపు
  • రూ. 50వేల లోపు ధరలో కియా కార్లపై అద్భుతమైన ఆఫర్లు

March Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ మార్చిలో భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల కారు మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆటో దిగ్గజం కియా కూడా పలు కార్లపై ఏకంగా రూ. 50వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. కియా మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొత్త కారు కొనాలని చూసేవారికి సోనెట్, సెల్టోస్ బెస్ట్ కార్లుగా చెప్పొచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఈ ఆఫర్లతో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ అలాగే కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఆన్-రోడ్ ధరలు కూడా తగ్గుతాయి. సైరోస్, కారెన్స్ క్లావిస్ కారెన్స్ క్లావిస్ ఈవీ వంటి వివిధ ఇతర ఆఫర్లు కూడా డీలర్‌షిప్ లెవల్ ప్రోత్సాహకాలతో అందుబాటులో ఉన్నాయి. కియా కార్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రాంతం ఆధారంగా మారుతుంటాయని గమనించాలి.

కియా సోనెట్, సెల్టోస్ డిస్కౌంట్ ఆఫర్లు :
మార్చి 2026లో కియా సోనెట్ రూ. 30వేలతో అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్లలో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అదనంగా రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ SUV లైనప్‌లో అత్యంత సరసమైన మోడళ్లలో ఇదొకటి. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి ఇతర పాపులర్ మోడళ్లతో పోటీపడుతుంది.

Read Also : Free JioHotstar : వావ్.. అద్భుతం.. జియో‌హాట్‌స్టార్ 3 నెలలు ఫ్రీ.. 50GB వరకు హైస్పీడ్ డేటా.. జియో, Vi, ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్లు

కియా సెల్టోస్ మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో మరో SUV, కొనుగోలుదారులు రూ. 20వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీతో వస్తుంది. ఈ SUV హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ వంటి పాపులర్ మోడళ్లతో పోటీపడుతుంది.

సైరోస్, కారెన్స్, క్లావిస్ ఈవీలపై భారీ డిస్కౌంట్లు :
డీలర్లు అందించే ప్రోత్సాహకాలను బట్టి కియా సైరోస్ రూ. 40వేలు లేదా అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి.

కియా కారెన్స్ క్లావిస్ కూడా అదే బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. మరోవైపు, కియా కారెన్స్ క్లావిస్ ఈవీ రూ. 20వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేలు కార్పొరేట్ ఆఫర్‌ అందిస్తుంది. ఇక బెనిఫిట్స్ కూడా రూ. 50వేలు లేదా అంతకంటే ఎక్కువ వరకు ఉండొచ్చు.

కియా కారు ఓనర్లకు అదనపు బెనిఫిట్స్ :
మరో బోనస్ స్కీమ్ కూడా ఉంది. ఇప్పటికే ఉన్న కియా కార్ల ఓనర్లకు వర్తిస్తుంది. ఈ ప్రోత్సాహకాలు ఎంపిక చేసిన కార్ల మోడళ్ల కొనుగోలుదారులకు వర్తిస్తాయి. కొనుగోలుదారులకు మొత్తం డిస్కౌంట్ వాల్యూను అందిస్తుంది.

ఈ మార్చి‌లోనే కార్లకు ఫుల్ డిమాండ్ :
మార్చి నెలలో సాధారణంగా కార్ల డిస్కౌంట్లు భారీగా ఉంటాయి. తయారీదారులు ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఇన్వెంటరీని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కియా SUV లేదా MPV కార్లు కూడా భారీ డిస్కౌంట్లు ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.