Kia Syros EV Launch : ఈవీ మార్కెట్‌లో కొత్త సెన్సేషన్.. కియా సిరోస్ EV వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌పై 526 కి.మీ రేంజ్..!

Kia Syros EV Launch : కియా కొత్త సిరోస్ ఈవీ వచ్చేసింది. 526 కి.మీ. రేంజ్‌తో ప్రారంభ ధర రూ. 7.99 లక్షలకు లభిస్తుంది. వేరియంట్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Kia Syros EV Launch

  • బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌
  • ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)
  • టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్)

Kia Syros EV Launch : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారతీయ ఈవీ మార్కెట్‌లోకి ఇప్పుడు మరో కొత్త ఈవీ ఎంట్రీ ఇచ్చింది. కారు మేకర్ కియా నుంచి కియా సైరోస్ ఈవీ లాంచ్ అయింది. కియా కొత్త సైరోస్ ఈవీని అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా చెప్పవచ్చు.

ముఖ్యంగా, ఈ కొత్త ఈవీని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌తో కొనుగోలు చేయొచ్చు. తద్వారా ప్రారంభ ధర భారీగా (Kia Syros EV Launch) తగ్గుతుంది. కొత్త ఈవీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే కియా సిరోస్ ఈవీ ఎస్‌యూవీ కారును ఎంచుకోవచ్చు.

కియా సిరోస్ ఈవీ ధర ఎంతంటే? :
ఫస్ట్ కియా కొత్త సిరోస్ ఈవీ ధర విషయానికి వస్తే.. కియా సిరోస్ ఈవీ (BaaS) మోడల్‌తో రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ కిలోమీటరుకు రూ. 3.3 నుంచి ఈఎంఐ ఆప్షన్‌లను కూడా అందిస్తోంది.

Read Also : iQOO Z11 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదిరిందిగా.. AI ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

ఈ కొత్త SUV డెలివరీలు జూలై 30న ప్రారంభమవుతాయి. కియా సిరోస్ ఈవీ, నాన్-BaaS మోడల్ (బ్యాటరీతో సహా మొత్తం కారు) కోసం రూ. 13.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి కొనేసుకోవచ్చు. టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. వివిధ వేరియంట్ల ఆధారంగా కియా సిరోస్ ఈవీ ధరలు ఇలా ఉన్నాయి.

  • HTK (42 kWh) : రూ 13.49 లక్షలు
  • HTK+ (42 kWh) : రూ. 14.99 లక్షలు
  • HTX (42 kWh) : రూ 15.99 లక్షలు
  • HTK+ ER (51.4 kWh) : రూ. 16.99 లక్షలు
  • HTX ER (51.4 kWh) : రూ 17.99 లక్షలు
  • HTX+ ER (51.4 kWh) : రూ. 19.49 లక్షలు
  • X-Line ER (51.4 kWh) : రూ. 19.99 లక్షలు

ఈవీ బ్యాటరీ :
కియా సిరోస్ ఈవీ 2 బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.
42 kWh బ్యాటరీ : సింగిల్ ఛార్జ్‌పై 443 కి.మీ వరకు ట్రావెల్ రేంజ్ (ARAI వెరిఫైడ్)
51.4 kWh బ్యాటరీ : సింగిల్ ఛార్జ్‌పై 526 కి.మీ వరకు వెరిఫైడ్ రేంజ్

లాంగ్ డ్రైవ్ కోసం కియా సిరోస్ ఈవీ 100kWDC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 10.8 kW ఏసీ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో కూడా వస్తుంది. భారీ బ్యాటరీ ప్యాక్ మోడల్‌లో 171PS పవర్ జనరేట్ చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఎస్‌యూవీ కేవలం 8.1 సెకన్లలో 0 నుంచి 100km/h స్పీడ్ అందుకోగలదు.