Kisan Vikas Patra : మీ డబ్బు డబుల్ చేసే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే! రూ.10 లక్షలకు ఎంత రాబడి వస్తుందంటే?

Kisan Vikas Patra Scheme : పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP)లో రూ. వెయ్యి పెట్టుబడితో ప్రారంభించవచ్చు. 7.5శాతం వడ్డీతో 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం..

Kisan Vikas Patra Scheme

  • పోస్టాఫీసులో ఈ స్కీమ్‌తో డబ్బు రెట్టింపు.. రూ.1,000 నుంచే పెట్టుబడి
  • స్టాక్ మార్కెట్ రిస్క్ వద్దా? రూ.20 లక్షల రాబడి వచ్చే కేవీపీ స్కీమ్
  • 9 ఏళ్ల 7 నెలల్లో మీ డబ్బు డబుల్ చేసే స్కీమ్.. కేవీపై 7.5శాతం వడ్డీ

Kisan Vikas Patra Scheme : ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? ఎక్కడ? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి వస్తుందో తెలుసా? ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీతో వచ్చే రాబడుల కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం మార్కెట్లో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. పెట్టుబడిలో రిస్క్ వద్దు.. సేవింగ్స్ డబ్బుకు స్థిరమైన రాబడి కావాలనుకుంటే పోస్టాఫీసు అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టడమే బెటర్..

స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు దూరంగా ఉండాలనుకునేవారికి పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర (KVP) స్మాల్ సేవింగ్స్ స్కీమ్ (Kisan Vikas Patra) అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి మొత్తం 115 నెలల్లో అంటే 9 ఏళ్ల 7 నెలల్లో భారీ మొత్తంలో రెట్టింపు అవుతుంది. పూర్తి వడ్డీ రేట్ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.10 లక్షలు పెడితే రూ.20 లక్షలు :
ప్రస్తుత 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం.. కేవీపీలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.20 లక్షలు అవుతాయి. అయితే, కేవీపీ వడ్డీ రేటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. అందుకే, భవిష్యత్తులో అకౌంట్ ఓపెన్ చేసే వారికి వడ్డీ రేటు, మెచ్యూరిటీ కాలం మారే అవకాశం ఉంటుంది.

రూ.1,000తోనే పెట్టుబడి :

కేవీపీలో పెట్టుబడికి పెద్ద మొత్తంలో డబ్బు అక్కర్లేదు. కేవలం రూ.1,000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత రూ.100 చొప్పున పెట్టుబడి పెంచుకోవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఒక వ్యక్తి తన పేరుతో ఒకటి కన్నా ఎక్కువ కేవీపీ ఖాతాలను కూడా ఓపెన్ చేయొచ్చు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు.. :
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, కరీంనగర్ వంటి నగరాల్లో నివసించే అర్హత కలిగిన వ్యక్తులు సమీప పోస్టాఫీసు ద్వారా కేవీపీలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మొత్తం మాత్రం ప్రతి వ్యక్తి ఆర్థిక సామర్థ్యం, లక్ష్యం ఆధారంగా మారుతుంది.

Read Also : Affordable Housing : రూ.50 లక్షల్లో మంచి ఇల్లు కావాలా? ఈ 3 నగరాల్లో కొనేసుకోండి.. 5 ఏళ్లలో 2రెట్లు రాబడి పక్కా..!

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? :
దేశంలో నివసించే పౌరులు ఎవరైనా కేవీపీలో పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ల తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నిబంధనలకు అనుగుణంగా 10 ఏళ్లు పైబడిన మైనర్ కూడా తన పేరుతో కేవీపీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు.

30 నెలల తర్వాత అడ్వాన్స్ విత్‌డ్రా :
సాధారణంగా కేవీపీ మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. అయితే, నిర్దిష్ట నిబంధనలకు లోబడి 2 ఏళ్ల 6 నెలలు అంటే.. 30 నెలల తర్వాత ముందస్తుగా క్యాష్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ముందుగానే విత్‌డ్రా చేసుకుంటే వర్తించే నియమాలు, వడ్డీ బెనిఫిట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఎక్కడ పెట్టుబడి? :
కేవీపీని పోస్టాఫీసులు, అధీకృత బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసే ముందే దరఖాస్తు ఫారం, అడ్రస్ ప్రూప్, వెరిఫికేషన్ డాక్యుమెంట్లు, అవసరమైన ఇతర కేవైసీ వివరాలు సమర్పించాలి.

పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేటు, మెచ్యూరిటీ కాలం, ముందస్తు విత్ డ్రా నిబంధనలు, పన్ను నిబంధనలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారు కొత్త నిబంధనలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం బెటర్.

కేవీపీ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరం? :
కేవీపీ ఖాతాను ఓపెన్ చేసేందుకు సాధారణంగా ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, వయస్సుకు సంబంధించిన డాక్యుమెంట్లు అవసరం.

  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు కాపీ
  • వయస్సు రుజువు కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటరు గుర్తింపు కార్డు
  • NREGA ఉద్యోగ కార్డు
  • జాతీయ జనాభా రిజిస్టర్

ప్రతి సందర్భంలోనూ అన్ని డాక్యుమెంట్లు అవసరం ఉండవు. దరఖాస్తు చేసేటప్పుడు వర్తించే డాక్యుమెంట్ల జాబితాను పోస్టాఫీసు లేదా బ్యాంకులో అడిగి తెలుసుకోండి.