ITR Filing : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ITRలో ఈ 5 పొరపాట్లు చేస్తే ఇంటికే ఐటీ నోటీసులు!
ITR Filing : ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ఐటీఆర్ వెరిఫికేషన్ కోసం ఏఐతో సహా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. చిన్న పొరపాట్లు జరిగినా వెంటనే తెలిసిపోతుంది. ఐటీ నోటీసులు వచ్చేస్తాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- June 7, 2026 / 04:13 PM IST
ITR Filing
- పన్నుచెల్లింపుదారులకు ఏ క్షణమైన ఐటీ నోటీసులు
- జూలై 31వ తేదీలోగా ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరి
- ఐటీఆర్ ఫైలింగ్ తప్పులు చేస్తే భారీ పెనాల్టీలు
ITR Filing : టాక్స్ పేయర్లు, సామాన్యులకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. జూలై 31వ తేదీలోగా ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఈ తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే భారీ మొత్తంలో పెనాల్టీలు పడతాయి. తద్వారా అనేక టాక్స్ బెనిఫిట్స్ కూడా కోల్పోయే అవకాశం ఉంది.
మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేయాలని చూస్తుంటే ముందుగా కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఐటీఆర్ వెరిఫికేషన్ కోసం ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు ఏఐ (AI)తో సహా కొత్త టెక్నాలజీని వాడుతోంది. తద్వారా ఏ కొంచెం చిన్నపాటి తప్పులు జరిగినా ఈజీగా దొరికిపోతారు జాగ్రత్త..
రూ. 10 లక్షలకుపైగా డిపాజిట్లు :
ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తి సేవింగ్స్ అకౌంట్లో రూ. 10 లక్షలు లేదా ఆపై ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే ఈ సమాచారం కూడా ఆదాయపు పన్ను శాఖకు అందుతుంది. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్‌లో చూపిన ఆదాయం ఈ డిపాజిట్‌తో మ్యాచ్ కాకుంటే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయవచ్చు.
క్రెడిట్ కార్డులతో హై వాల్యూ పేమెంట్లు :
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రతి క్రెడిట్ కార్డు లావాదేవీకి సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు అవుతుంది. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో మీరు చూపిన ఆదాయం, మీ క్రెడిట్ కార్డు ఖర్చులతో మ్యాచ్ కాకుంటే ఐటీ శాఖ మిమ్మల్ని లెక్కలు అడగవచ్చు.
ఆస్తి కొనుగోలు, అమ్మకం వివరాలు :
ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఆస్తికి సంబంధించిన హై వాల్యూ పేమెంట్ల వివరాలను తప్పనిసరిగా అందించాలి. పన్ను చెల్లింపుదారులు ఏదైనా భూమిని అమ్మినా లేదా కొనుగోలు చేసినా ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు తెలుస్తుంది. తమ ఐటీ రిటర్న్‌లలో పాత పేమెంట్ల సమాచారాన్ని వెల్లడించకపోతే పన్ను చెల్లింపుదారులను ఆదాయ పన్ను శాఖ విచారించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లలో పెట్టుబడి :
చాలా మంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, బాండ్లు షేర్లలో పెట్టుబడి పెడతారు. ఆర్థిక సంస్థలు ఈ పేమెంట్లను ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేస్తాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ఎవరైనా తమ రిటర్న్‌లో ఇలాంటి హై వాల్యూ పేమెంట్లను వెల్లడించకపోతే ఐటీ శాఖ నోటీసు జారీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
హై వాల్యూ పేమెంట్ల ప్రూఫ్ ఉంచుకోండి :
పన్ను చెల్లింపుదారులు హై వాల్యూ పేమెంట్లు చేసినా ఆస్తిని కొన్నా లేదా విక్రయించినా లేదా క్రెడిట్ కార్డుపై భారీ మొత్తంలో ఖర్చు చేసినా అది చట్టవిరుద్ధం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఇలాంటి ఆర్థిక సమాచారాన్ని దాచిపెట్టొద్దు. ఒకవేళ ఐటీ సంబంధిత శాఖ విచారిస్తే సాక్ష్యంగా సమర్పించేందుకు వీలుగా ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలను ప్రూఫ్ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి.
