LPG e-KYC : మీది ఏ గ్యాస్ కనెక్షన్?.. HP, Indane, Bharat Gas.. దేనికి e-KYC ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్

LPG e-KYC Pending : ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లు తమ గ్యాస్ కనెక్షన్ ఏదైనా తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా ఇ-కేవైసీని పూర్తి చేయాలి. లేదంటే వారికి అందాల్సిన గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది.. ఎలా కేవైసీ పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం..

LPG e-KYC Pending

  • గ్యాస్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. e-KYC చేయకపోతే ఏమవుతుంది?
  • ఇండేన్, HP, భారత్ గ్యాస్ మొబైల్‌లో ఎలా పూర్తి చేయాలి?
  • LPG e-KYC ఎందుకు చేయాలి? గడువు ఎప్పుడు?

LPG e-KYC Pending : ఎల్‌పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మీరు ఎల్పీజీ కనెక్షన్ కోసం ఇ-కేవైసీ పూర్తి చేశారా? లేదంటే ఇప్పుడే కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయండి. గడువు తేదీలోగా ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే భారీగా నష్టపోతారు జాగ్రత్త..

ఎల్పీజీ కస్టమర్ల కోసం ఆధార్ ఆధారిత e-KYC (బయోమెట్రిక్ వెరిఫికేషన్ ) చాలా కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సబ్సిడీ, గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ వివరాలను వెరిఫై చేసేందుకు ఈ e-KYC ప్రాసెస్ నిర్వహిస్తోంది.

మీరు ఒకవేళ ఇప్పటివరకూ గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే భవిష్యత్తులో సబ్సిడీ, సిలిండర్ బుకింగ్ వంటి సేవలను వినియోగించుకోలేరు. అందుకే ప్రతి ఎల్పీజీ కస్టమర్లు తమ గ్యాస్ కంపెనీ సూచించిన విధంగా e-KYC పూర్తి చేయడమే బెటర్.

గతంలో ఇ-కేవైసీ పూర్తి చేసినా కూడా మరోసారి రీ ఇ-కేవైసీని చేసి చూడండి. ఏదైనా కారణం చేత మీ కేవైసీ ఇంకా అప్ డేట్ కాకుంటే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ద్వారా అందే బెనిఫిట్స్ కోల్పోవాల్సి వస్తుంది. మీరు ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు కేవలం ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా ఎలా ఈజీగా ఇ-కేవైసీని పూర్తి చేయాల ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం..

ఎందుకు e-KYC చేయాలంటే? :

  • ఆధార్ ద్వారా కస్టమర్ల వివరాలను వెరిఫై తప్పనిసరి
  • సబ్సిడీ బెనిఫిట్స్ పొందవచ్చు
  • డూప్లికేట్ లేదా ఫేక్ కనెక్షన్లను గుర్తించి నియంత్రించవచ్చు.
  • గ్యాస్ కనెక్షన్ వివరాలు అప్‌డేట్‌గా ఉంచుకోవచ్చు

రూల్స్ ఏంటి? :

  • ఆధార్‌తో బయోమెట్రిక్ (ఫేస్ స్కాన్) వెరిఫికేషన్ తప్పనిసరి.
  • గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తోనే లాగిన్ అవ్వాలి.
  • ఆధార్‌లో రిజిస్టర్ చేసిన వివరాలు చెక్ చేసుకోవాలి

గడువు తేదీ ఎప్పటివరకంటే? :
ప్రస్తుత సమాచారం ప్రకారం.. 2026 ఆగస్టు 16లోపు ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ లేదా కొన్ని ఎల్పీజీ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి.

Read Also : UPI Charges : UPIలో ఫ్రెండ్‌కు డబ్బులు పంపుతున్నారా? ఇద్దరికీ ఛార్జీలు పడతాయా? అసలు నిజం ఇదే..!

ఇండేన్ (Indane) గ్యాస్ కస్టమర్లు ఇలా చేయాలి? :

ముందుగా IndianOil One, AadhaarFaceRD యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలి.
1. IndianOil One యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌తో లాగిన్ అవ్వండి.
2. (Link My LPG ID)పై క్లిక్ చేసి 16 అంకెల LPG ID ఎంటర్ చేయండి. (ఈ నంబర్ క్యాష్ మెమో లేదా సబ్‌స్క్రిప్షన్ వోచర్‌)
3. హోమ్ స్క్రీన్‌లో My Profile, Indane Details ఆప్షన్ వద్దకు వెళ్లండి.
4. Re-KYC ఆప్షన్ క్లిక్ చేసి నిబంధనలు అంగీకరించండి.
5. (Proceed)పై క్లిక్ చేసి (Face Scan) ఆప్షన్ ఎంచుకోండి.
6. AadhaarFaceRD యాప్‌తో ఫేస్ స్కాన్ చేస్తే e-KYC పూర్తవుతుంది.

HP గ్యాస్ కస్టమర్లు ఇలా చేయాలి? :

ముందుగా HP Pay, AadhaarFaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయండి.
1. HP Pay యాప్‌లో గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
2. హోమ్ స్క్రీన్‌లో LPG సెక్షన్‌కు వెళ్లండి.
3. e-KYC ఆప్షన్ వద్ద క్లిక్ చేయండి.
4. నిబంధనలు అంగీకరించి తర్వాత (Capture Face)పై క్లిక్ చేయండి.
5. AadhaarFaceRD యాప్ ఓపెన్ అవుతుంది.
6. ఫేస్ స్కాన్ చేశాక e-KYC కంప్లీట్ అయినట్టే.

భారత్ గ్యాస్ (Bharat Gas) కస్టమర్లు ఇలా చేయాలి? :

ముందుగా భారత్ గ్యాస్ వినియోగదారులు ఈ అధికారిక యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్‌లోడ్ చేయండి.
1. Hello BPCL యాప్ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అవ్వండి.
2. హోమ్ స్క్రీన్‌లో e-KYC లేదా ‘బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్’పై క్లిక్ చేయండి.
3. స్క్రీన్‌పై సూచనలతో ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయండి.
4 . వెరిఫికేషన్ తర్వాత మీ ఎల్పీజీ ఇ-కేవైసీ పూర్తి అయినట్టే

వినియోగదారులు తప్పక తెలుసుకోండి .
ఇ-కేవైసీ పూర్తి చేసేటప్పుడు గ్యాస్ కనెక్షన్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఫేస్ స్కాన్ సమయంలో మంచి లైటింగ్ ఉండే ప్రదేశంలో ప్రాసెస్ పూర్తి చేయండి. అప్పుడే వెరిఫికేషన్ ఈజీగా పూర్తవుతుంది. ఎల్పీజీ సేవలు, సబ్సిడీ బెనిఫిట్స్ కొనసాగాలంటే చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దు. మీ గ్యాస్ కంపెనీ యాప్ ద్వారా వెంటనే ఇ-కేవైసీని పూర్తి చేయడం బెటర్.