LPG Gas eKYC : LPG గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటితో ముగియనున్న గడువు.. లేదంటే కనెక్షన్ కట్
LPG Gas eKYC : దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను(LPG Gas Cylinder) వాడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది.
- V Santhosh Kumar
- Updated on- August 31, 2026 / 10:49 AM IST
Lpg gas cylinder E kyc last date august 31 complete to avoid subsidy loss
- ఆగస్ట్ 31తో ముగియనున్న కేవైసీ
- పూర్తికాకపోతే సబ్సిడీ నిలిచే అవకాశం
- ఏజెన్సీ లేదా మొబైల్ ఆన్‌లైన్
LPG Gas Cylinder: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. గ్యాస్ సరఫరాలో అక్రమాలకు, బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెడుతూ అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ఫలాలు అందించేందుకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు గడువు పెంచినప్పటికీ, సాంకేతిక సమస్యల దృష్ట్యా చివరిగా ఆగస్ట్ 31 వరకు అవకాశం కల్పించారు. ఆ డెడ్‌లైన్ నేటితో ముగియనుండటంతో వినియోగదారులు వెంటనే కేవైసీ పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Harish Rao: ప్రభుత్వ భూముల కేటాయింపులపై హరీశ్ రావు ఫైర్.. సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ
సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం, ఆఫ్‌లైన్ విధానం ఇదే:
ఆగస్ట్ 31 లోపు కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు భవిష్యత్తులో గ్యాస్ (LPG Gas Cylinder)సబ్సిడీ కోల్పోవడమే కాకుండా, సిలిండర్ బుకింగ్, డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఇప్పటికే పూర్తి చేయని వారికి ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్ల ద్వారా సమాచారం అందిస్తున్నారు. వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్ బుక్ సమర్పించి ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ బయోమెట్రిక్ ద్వారా ఆఫ్‌లైన్‌లో ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లోనే ఈ-కేవైసీ:
ఏజెన్సీల వద్ద క్యూ లైన్లలో నిలబడకుండా కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో కేవైసీ పూర్తి చేసే వెసులుబాటు ఉంది. సంబంధిత గ్యాస్ కంపెనీ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ సంఖ్య, గ్యాస్ కనెక్షన్ వివరాలు నమోదు చేసి ‘ఆధార్ ఫేస్ ఆర్‌డీ’ యాప్ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి సబ్మిట్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది. ఇప్పటికే పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
