Mahindra XUV 3XO CNG : వారెవ్వా.. మహీంద్రా ఫస్ట్ CNG SUV అదుర్స్.. ధర రూ.9.99 లక్షలే.. 6 ఎయిర్‌బ్యాగ్స్, స్కైరూఫ్, 24.7 కి.మీ మైలేజ్..

Mahindra XUV 3XO CNG : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ జెడ్ఎన్‌జీ సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది. ఈ మహీంద్రా కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు ఉండగా 24.7కి.మీ, కేజీ మైలేజ్, 200Nm టార్క్, 270 లీటర్ల బూట్ స్పేస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ప్రీమియం ఫీచర్లు, అన్ని వేరియంట్ల ధరలపై ఓసారి లుక్కేయండి..

Mahindra XUV 3XO CNG Launch

  • మహీంద్రా నుంచి ఫస్ట్ CNG SUV వచ్చేసింది
  • మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ధర రూ.9.99 లక్షలే
  • 200Nm టార్క్‌తో అదరగొట్టే ఎక్స్‌యూవీ కారు

Mahindra XUV 3XO CNG : మహీంద్రా లవర్స్ మీకోసమే.. భారత మార్కెట్లోకి మహీంద్రా నుంచి సరికొత్త SUV వచ్చేసింది. అదే మహీంద్రా XUV 3XO ZNG కారు.. కంపెనీ ఫస్ట్ CNG SUV మోడల్ కూడా..పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి అద్భుతమైన ఆప్షన్. ఈ ఎస్‌యూవీ స్టైల్, టర్బో పవర్, అదిరిపోయే మైలేజ్‌ను సింగిల్ కారులో అందించడమే స్పెషాలిటీ అని చెప్పొచ్చు. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

ధరలు ఎంతంటే? :
మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO సీఎన్‌జీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది. ఎంఎక్స్ ఎడ్జ్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. REVX EDGE (O) ధర రూ.10.79 లక్షలు. AX5 వేరియంట్ ధర రూ.11.19 లక్షలు. టాప్ REVX A వేరియంట్ ధర రూ.12.27 లక్షలుగా ఉంటుంది.

టర్బో ఇంజిన్.. అదిరిపోయే పవర్ :
ఈ SUVలో 1.2-లీటర్ (mStallion TCMPFi) టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ మోడ్‌లలో 82kW పవర్, 200Nm టార్క్ అందిస్తుంది. ముఖ్యంగా సీఎన్‌జీ వాహనంలోనూ టర్బో ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. కేవలం 4.9 సెకన్లలో 0 నుంచి 60కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Xiaomi 17 Ultra Deal : కెమెరా లవర్స్‌కు బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఈ షావోమీ 17 అల్ట్రాపై రూ.18వేలు తగ్గింపు..!

లీటర్ కాదు.. కిలోకు 24.7 కి.మీ :
మైలేజ్ విషయంలోనూ ఈ SUV ప్రత్యేకంగా నిలుస్తుంది. కిలో సీఎన్‌జీకి 24.7 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇందులో 10-బార్ సీఎన్‌జీ ఇంజెక్షన్ ప్రెజర్ సిస్టమ్ ఉంది. సీఎన్‌జీ అయిపోతే ఆటోమేటిక్‌గా పెట్రోల్ మోడ్‌లోకి మారుతుంది.

బూట్ స్పేస్‌కు ఢోకా లేదు :
రెండు CNG సిలిండర్లను బూట్ కింద అమర్చే అండర్‌ఫ్లోర్ టెక్నాలజీని వాడారు. దీంతో 270 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. స్పేర్ వీల్‌ను కూడా కింద అమర్చారు.

సేఫ్టీ, ప్రీమియం ఫీచర్లు
ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, ISOFIX సహా 35కు పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గ్యాస్ లీక్‌ను గుర్తిస్తే వెంటనే పెట్రోల్ మోడ్‌కు మారుతుంది. ఇందులో రెండు 26.03 సెం.మీ స్క్రీన్‌లు, స్కైరూఫ్, డాల్బీ అట్మాస్ ఆడియో, బ్లాక్ లెదరెట్ సీట్లు ఉన్నాయి. మొత్తంగా, మైలేజ్‌తో పాటు పవర్, సౌకర్యాలు కోరుకునే వారికి మహీంద్రా XUV 3XO జెడ్‌ఎన్‌జీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.