Maruti Suzuki Offers : మారుతి జూన్ ఆఫర్లు.. ఈ పాపులర్ కార్లపై రూ. 90వేల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?
Maruti Suzuki June Discounts : ఈ జూన్ నెలలో మారుతి సుజుకి అనేక కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కొత్త కారు కొనే ముందు పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- June 5, 2026 / 05:45 PM IST
Maruti Suzuki Offers
- జూన్ నెలలో మారుతి సుజుకి కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు
- ఈ మారుతి పాపులర్ కార్లపై రూ. 90వేల వరకు బెనిఫిట్స్
- విక్టోరిస్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60వేల వరకు బెనిఫిట్స్
Maruti Suzuki June Discounts : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. ఈ జూన్ నెలలో మారుతి కొత్త కారు కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.. ఈ జూన్‌లో మారుతి సుజుకి అనేక కార్లపై అద్భుతమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. తక్కువ ధరకే మీకు నచ్చిన వేరియంట్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
మారుతి సుజుకి ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, సంస్థాగత ఆఫర్లు, గ్రామీణ కస్టమర్లకు (Maruti Suzuki Offers) స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు జూన్ 2 నుంచి జూన్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి సుజుకి విక్టోరిస్ ఆఫర్లు :
ప్రస్తుతం మారుతి సుజుకి విక్టోరి భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ. 90వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. విక్టోరిస్ CNGపై రూ. 80వేల వరకు బెనిఫిట్స్ ఉంటాయి. విక్టోరిస్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
Read Also : Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!
మారుతి సుజుకి బ్రెజ్జా ఆఫర్లు :
ఈ నెలలో కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జాపై రూ. 55వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు రెండింటిపై అందుబాటులో ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జాతో పాటు అనేక ఇతర కార్లపై కూడా ఈ కింది విధంగా కొన్ని బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఆల్టో : రూ. 52,500 వరకు డిస్కౌంట్
- వాగన్ఆర్ : రూ. 52,500 వరకు తగ్గింపు
- స్విఫ్ట్ : రూ. 45,500 వరకు ఆఫర్లు
- S-ప్రెస్సో : రూ. 37,500 వరకు ఆఫర్లు
- S-సెలెరియో : రూ. 37,500 వరకు ఆఫర్లు
మారుతి సుజుకి ప్రకారం.. ఈ ఆఫర్లు జూన్ 2026 వరకు అందుబాటులో ఉంటాయి. కారు వేరియంట్, ఫ్యూయిల్ ఆప్షన్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, గ్రామీణ అమ్మకాల పథకాలపై ఆధారపడి మారవచ్చు. అందుకే కారు కొనే ముందు ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించడమే బెటర్..
