Maruti Suzuki SUV : మారుతి ఫ్యాన్స్‌కు మెగా ఆఫర్.. విక్టోరిస్ కారుపై ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొంటే భారీ లాభం..!
Maruti Suzuki SUV : కొత్త మిడ్-సైజ్ SUV కొనాలని చూస్తున్నారా? మారుతి సుజుకి విక్టోరిస్ అద్భుతమైన ఆప్షన్. ఈ SUV జూలైలో రూ. 2 లక్షల వరకు ఆఫర్లతో లభిస్తుంది.
- Sreehari A
- Published on- July 6, 2026 / 10:13 PM IST
Maruti Suzuki SUV
- కొత్త మారుతి కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్
- మారుతి విక్టోరిస్ కారు ధర ఎంత తగ్గిందో తెలుసా?
- ఈ పాపులర్ మోడల్ CNGపై రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్
Maruti Suzuki SUV : మారుతి లవర్స్ కు ఎగిరిగంతేసే వార్త.. మీరు కొత్త మిడ్-సైజ్ SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. మారుతి సుజుకి విక్టోరిస్ ఈ జూలైలో భారీ తగ్గింపుతో లభిస్తోంది. లాంచ్ అయిన కొద్ది నెలల్లోనే మారుతి సుజుకి విక్టోరిస్ భారత మార్కెట్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కస్టమర్లలో ఇదే పాపులర్ మోడల్. అమ్మకాల పరంగా ఇతర భారీ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది. మీరు (Maruti Suzuki SUV) కొత్త ఎస్‌యూవీ కొనాలని చూస్తుంటే.. ఈ మోడల్ అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. ఆఫర్లు, ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివంగా తెలుసుకుందాం..
ఈ జూలైలో మారుతి సుజుకి విక్టోరిస్‌పై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. డీలర్ సమాచారం ప్రకారం.. ఈ ఎస్‌యూవీలోని కొన్ని వేరియంట్లపై, ముఖ్యంగా సీఎన్‌జీ మోడల్‌పై మొత్తం రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది.
ధర ఎంతంటే? :
జూలై ఒకటో తేదీన మారుతి సుజుకి నెలవారీ సేల్స్ మీడియా బ్రీఫింగ్ జరిగింది. ఈ సమావేశంలో కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ మాట్లాడుతూ.. గత జూన్‌లో విక్టోరిస్ హోల్‌సేల్ అమ్మకాలు సుమారు 10వేలు యూనిట్లు కాగా, రిటైల్ అమ్మకాలు 13వేల యూనిట్లకు పైగా ఉన్నాయని తెలిపారు.
విక్టోరిస్ అమ్మకాలలో 50 శాతానికి పైగా సీఎన్‌జీ వేరియంట్ వాటా ఉందని, అలాగే మొత్తం మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో సీఎన్‌జీ మోడల్ వాటా సుమారు 42 శాతంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి విక్టోరిస్ పలు ఇంజన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది. పెట్రోల్, సీఎన్ జీ, హైబ్రిడ్ వేరియంట్లలో లభిస్తుంది. ఆసక్తికరంగా, సీఎన్‌జీ మోడల్‌లో ట్యాంక్ కింద అమర్చి ఉంటుంది. తద్వారా ట్రంక్‌లో లగేజీకి పుష్కలమైన స్పేస్ లభిస్తుంది.
విక్టోరిస్ కారు ఫీచర్లు :
మారుతి సుజుకి 2010 నుంచి భారత మార్కెట్లో సీఎన్‌జీ కార్లను విక్రయిస్తోంది. కారు అడుగు భాగంలో సీఎన్‌జీ ట్యాంక్‌తో వచ్చిన కంపెనీ ఫస్ట్ కారు విక్టోరిస్. ఈ మోడల్ 2025లో లాంచ్ అయింది. మైలేజ్ పరంగా చూస్తే.. మారుతి సుజుకి విక్టోరిస్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.18kmpl, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 21.06kmpl, సీఎన్‌జీ మాన్యువల్ వేరియంట్ 27.02km/kg, హైబ్రిడ్ e-CVT వేరియంట్ 28.65kmpl మైలేజీని ఇస్తాయి.
ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్య ఉండగా, సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 11.50 లక్షల నుంచి రూ.14.72 లక్షల మధ్య ఉంటుంది.
