Meta Layoffs : మెటాలో భారీగా ఉద్యోగాల కోత.. ఇది పుకారు కాదు.. అసలు నిజాన్ని బయటపెట్టిన మెటా.. ఏకంగా 8వేల మంది ఇంటికి?
Meta Layoffs : ఈసారి, ఏఐ (AI) కారణంగా మెటా భారీ ఉద్యోగ కోతలకు రెడీ అవుతోంది. మే 20వ తేదీన ఏకకాలంలో 8వేల మంది ఉద్యోగులను తొలగించనున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగులకు మెటా మెమో కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది.
Meta Layoffs
- భారీ ఉద్యోగాల కోతకు రెడీ అవుతున్న మెటా కంపెనీ
- వచ్చే మే 20న ఏకంగా 8వేల మందిని తొలగించనున్నట్టు ప్రకటన
- ఏఐ పెట్టుబడుల ఖర్చుల కోసం వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు
Meta Layoffs : మెటా కంపెనీ భారీ ఉద్యోగాల కోతకు సన్నద్ధమవుతోంది. మెటా ప్లాట్‌ఫామ్స్ మే 20న కంపెనీ ఉద్యోగులలో సుమారు 10 శాతం అంటే.. దాదాపు 8వేల మందిని తొలగించాలని యోచిస్తోంది. ఏఐ (AI)లో భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేసేందుకు భారీ తొలగింపులు చేపట్టనున్నట్టు కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోలో ప్రకటించింది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు పేరెంట్ కంపెనీ అయిన మెటా ప్లాట్‌ఫామ్స్.. 6వేల ఖాళీ పోస్టులకు కొత్త వారిని తీసుకోనేది లేదని కూడా స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రొడక్టులను డెవలప్ చేసేందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మెటా మెమో లీక్ :
ఉద్యోగులకు రాసిన లేఖలో.. కంపెనీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ జానెల్ గేల్.. కంపెనీని మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఇతర పెట్టుబడులను బ్యాలెన్స్ చేసేందుకు ఈ తొలగింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ ప్లాన్ ఇప్పటికే బయటకు లీక్ అయిందని, అందుకే కంపెనీ ఈ సమాచారాన్ని వీలైనంత త్వరగా షేర్ చేయాలని భావిస్తోందని గేల్ రాశారు. ఇది శుభవార్త కాదని, ఆందోళన కలిగిస్తుందని గేల్ పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులలో ఇదే సరైన మార్గమని తెలిపారు.
తొలగించిన ఉద్యోగులకు భారీ ప్యాకేజీ :
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు భారీ మొత్తంలో సెవరెన్స్ ప్యాకేజీని మెటా అందించనుంది. అమెరికాలో, ఇందులో 16 వారాల ప్రాథమిక జీతంతో పాటు, ప్రతి ఏడాది సర్వీసుకు రెండు వారాల అదనపు వేతనం ఉంటుంది.
అదనంగా, 18 నెలల పాటు కోబ్రా (COBRA) హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కూడా అందిస్తారు. ఇలాంటి ప్యాకేజీలను ఇతర దేశాలలో కూడా అందిస్తారు. కానీ, మెటా అందించే ప్యాకేజీలు ఆయా దేశాన్ని బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంది.
టెక్ కంపెనీలలో ఉద్యోగ కోతలు :
మైక్రోసాఫ్ట్ వంటి ఇతర ప్రధాన టెక్ కంపెనీలతో పాటు మెటా కూడా పెరుగుతున్న ఏఐ ఖర్చుల కోసం వేలాది మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సిందిగా ఆదేశించింది.
ఉద్యోగులకు జుకర్‌బర్గ్ డైరెక్ట్ మెసేజ్ :
మెటా కంపెనీ చీఫ్ జనరల్ గేల్ నేరుగా ఉద్యోగులను ఉద్దేశించి ఈ మెమో జారీ చేశారు. ఆ మెమోలో ఆయన ఏమన్నారంటే.. “మా కంపెనీని మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఇతర పెట్టుబడుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నాం. అంతా ఈజీ నిర్ణయం కాదని తెలుసు. మెటాలో విలువైన సేవలను అందించిన వ్యక్తులను తప్పని పరిస్థితుల్లో వదులుకోక తప్పడం లేదు” అని పేర్కొన్నారు.
