MG Hector Plus SUV : లగ్జరీ లుక్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ SUV ఎంట్రీ.. ఫీచర్లు, మైలేజీ ఎంతంటే?

MG Hector Plus SUV : ఎంజీ మోటార్ ఇండియా హెక్టర్ ప్లస్ డీజిల్‌ను రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 14-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

MG Hector Plus SUV

  • ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ 7-సీటర్ షార్ప్ ప్రో (O) ట్రిమ్‌లో మాత్రమే
  • రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుంది
  • టాటా సఫారీ హ్యుందాయ్ అల్కాజర్‌లకు గట్టి పోటీ

MG Hector Plus SUV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ఎంజీ మోటార్ ఇండియా నుంచి సరికొత్త ఎస్‌యూవీ వచ్చేసింది. ప్రముఖ ఎస్‌యూవీ హెక్టర్ ప్లస్ డీజిల్ వేరియంట్‌ను భారత మార్కెట్లో మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

కంపెనీ కొత్త షార్ప్ ప్రో (O) ట్రిమ్‌లో తీసుకొచ్చింది. అయితే, ఈసారి ఇందులో కీలక మార్పు చేసింది. కేవలం 7-సీటర్ మోడల్ మాత్రమే డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. గతంలో 5-సీటర్ డీజిల్ వేరియంట్‌ను లైనప్ నుంచి కంపెనీ తొలగించింది.

డిసెంబర్ 2025లో హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. కానీ, ఆ సమయంలో పెట్రోల్ వేరియంట్ల (MG Hector Plus SUV) ధరలను మాత్రమే రివీల్ చేసింది. ఇప్పుడు, కంపెనీ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీ టాటా సఫారీ హ్యుందాయ్ అల్కాజార్ మోడళ్లతో నేరుగా పోటీపడుతుంది. అయితే, కేవలం సింగిల్ డీజిల్ వేరియంట్ మాత్రమే ఉండగా ఇతర ఆప్షన్లు అందుబాటులో లేవు.

ARAI ప్రకారం.. ఈ SUV సుమారు లీటర్ చొప్పున 16.6 కి.మీ మైలేజ్ అందిస్తుంది. అదే సిటీలో లీటర్ కొట్టిస్తే 10 నుంచి 13కి.మీ దూసుకెళ్తుంది. అలాగే, హైవేపై లీటర్‌కు 14 నుంచి 16కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది.

డిజైన్‌, ఇతర వివరాలివే :
కొత్త హెక్టర్ ప్లస్ డీజిల్ షార్ప్ ప్రో (O) వేరియంట్ , ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లతో టాప్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

డీజిల్ మోడల్ గతంలో అనేక ట్రిమ్‌లలో అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు కేవలం సింగిల్ ట్రిమ్‌లో 7-సీటర్ లేఅవుట్‌లో అందిస్తున్నారు. హ్యుందాయ్ అల్కాజర్, మహీంద్రా XUV700 టాటా సఫారీ వంటి ఎస్‌యూవీలు మరిన్ని ఆప్షన్లను అందిస్తున్నాయి.

Read Also : BMW 7 Series Bookings : లగ్జరీ కారు కావాలా? హై-టెక్ ఫీచర్లతో కొత్త BMW సెడాన్ వస్తోందోచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!

క్యాబిన్‌లో ప్రీమియం ఫీచర్లు :
షార్ప్ ప్రో (O) ట్రిమ్, టాప్-ఆఫ్-ది-లైన్ సావీ ప్రో వేరియంట్ కన్నా కొంచెం దిగువన ఉంటుంది. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ టాన్ బ్లాక్ థీమ్ ఉంటుంది. డాష్‌బోర్డ్ డోర్ ప్యాడ్‌లపై లెదరెట్ ఫినిషింగ్‌లతో పాటు 7 సీట్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో భారీ 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఫిజికల్ బటన్లతో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

ఫీచర్లు, సేఫ్టీ వివరాలు :
కొత్త హెక్టర్ ప్లస్ డీజిల్ వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, సబ్‌వూఫర్, 8-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, యాంప్లిఫైయర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది.

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే..
6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్యాక్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. అలాగే, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్, పీఎం 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ లెవెల్-2 అడాస్ వంటి ఫీచర్లు లేవు.

ఇంజిన్ గేర్‌బాక్స్ :
ఈ ఎస్‌యూవీ అదే 2.0-లీటర్ టర్బోడీజిల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజన్ 170 హార్స్‌పవర్ 350Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.
ప్రస్తుతం, కంపెనీ ఈ డీజిల్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ ఇవ్వడం లేదు. ఇదే ఇంజన్‌ను టాటా హారియర్ టాటా సఫారీలలో కూడా అందుబాటులో ఉంది. దాంతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా లభిస్తుంది.