Moto Pad 70 Pro : 10200mAh బ్యాటరీ, 3.5K డిస్‌ప్లేతో కొత్త మోటో ప్యాడ్ 70 ప్రో ట్యాబ్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..
Moto Pad 70 Pro : మోటోరోలా కొత్త ట్యాబ్ బ్యాంకు ఆఫర్లతో కొనేసుకోవచ్చు. భారీ 10,200mAh బ్యాటరీ, 3.5K డిస్‌ప్లేతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.. పూర్తి ధర, ఫీచర్లు ఇవే..
- Sreehari A
- Published on- June 28, 2026 / 03:48 PM IST
Moto Pad 70 Pro
- 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 10200mAh బ్యాటరీ సపోర్టు
- కంపెనీ బ్యాక్ సైడ్ 13MP ఆటోఫోకస్ కెమెరా సెటప్
- సేఫ్టీ కోసం పవర్ బటన్‌పై ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Moto Pad 70 Pro : కొత్త టాబ్లెట్ కొందామని చూస్తున్నారా? మోటోరోలా కొత్త టాబ్లెట్ మోటో ప్యాడ్ 70 ప్రో వచ్చేసింది. 3.5K రిజల్యూషన్‌తో భారీ 13-అంగుళాల డిస్‌ప్లే అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 10,200mAh బ్యాటరీ ఉంది. బ్యాక్ కెమెరా (Moto Pad 70 Pro) పరంగా 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరాలో 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మోటో ప్యాడ్ 70 ప్రో ధర, లభ్యత :
భారత మార్కెట్లో మోటో ప్యాడ్ 70 ప్రో ఫోన్ 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ. 36,999గా ఉంది. 8GB ర్యామ్+ 256GB వేరియంట్ రూ. 39,999కి, 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ. 45,999కి కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఈ టాబ్లెట్ కొనుగోలుపై రూ. 4వేలు తగ్గింపు అందిస్తుంది. ప్రారంభ వేరియంట్ రూ. 32,999, టాప్ వేరియంట్ ధర రూ. 41,999కి సొంతం చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా ఈ మోటో ప్యాడ్ కొనేసుకోవచ్చు.
మోటో ప్యాడ్ 70 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటో ప్యాడ్ 70 ప్రోలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 13-అంగుళాల ఎల్టీపీఎస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 3.5K (3504×2190 పిక్సెల్స్) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టాబ్లెట్ 800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 99శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్‌కు సపోర్టు ఇస్తుంది.
4nm ప్రాసెసింగ్‌పై ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అడ్రినో 825 జీపీయూ సపోర్టు ఇస్తుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16OSతో రన్ అవుతుంది.
మోటో ప్యాడ్ 70 ప్రో బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు 13MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP ఫిక్స్‌డ్-ఫోకస్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 10,200mAh బ్యాటరీ ఉంది. సేఫ్టీ కోసం పవర్ బటన్‌పై ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే..
ఈ టాబ్లెట్ వై-ఫై 7 802.11, బ్లూటూత్ v6.0, USB టైప్-సీకి సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం జేబీఎల్-ట్యూన్డ్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ IP52 రేటింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 296.48 x 191.91x 6.20mm, బరువు 598 గ్రాములు ఉంటుంది.
