Motorola Edge 50 Fusion : కిర్రాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కేవలం రూ. 15వేల లోపే.. ఇప్పుడే కొనడం బెటర్..!
Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. రూ. 15వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ధర భారీగా తగ్గింది. ఈ మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే (Motorola Edge 50 Fusion) లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ డిస్కౌంట్ (Motorola Edge 50 Fusion) :
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర మొదట రూ.22,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5Gని కేవలం రూ.18,999కే ఆఫర్ చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొత్త ఫోన్‌పై రూ.14,400 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. మీ పాత ఫోన్ వాల్యూ దాదాపు రూ.5వేలు ఉంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
ఈ మోటోరోలా ఫోన్ IP68 రేటింగ్‌తో (Motorola Edge 50 Fusion) వస్తుంది. అద్భుతమైన 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అన్నీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అయ్యే అప్‌గ్రేడ్‌ల ఆప్షన్ కూడా అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఫోటోగ్రఫీ కోసం.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G బ్యాక్ సైడ్ 50+ 13MP లెన్స్‌లతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హై క్వాలిటీ 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, ఆకట్టుకునే 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.