OnePlus Nord CE 4 5G : బిగ్ డిస్కౌంట్.. ఈ వన్‌ప్లస్ 5G ఫోన్‌పై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

OnePlus Nord CE 4 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G ఫోన్ ఆఫర్ అదిరింది.. కేవలం రూ. 15వేల లోపు ధరలో ఈ వన్‌ప్లస్ కొనేసుకోవచ్చు..

OnePlus Nord CE 4 5G : బిగ్ డిస్కౌంట్.. ఈ వన్‌ప్లస్ 5G ఫోన్‌పై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

OnePlus Nord CE 4 5G

Updated On : June 21, 2025 / 5:43 PM IST

OnePlus Nord CE 4 5G : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వన్‌ప్లస్ నార్డ్ CE4 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గతంలో కన్నా తగ్గింపు ధరకే (OnePlus Nord CE 4 5G) లభిస్తోంది. అసలు లాంచ్ ధర కన్నా ఏకంగా రూ. 10వేలు తగ్గింది. ఈ ఫోన్ గత ఏడాదిలోనే లాంచ్ కాగా 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE5 త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ CE4 5G డిస్కౌంట్ :
డిస్కౌంట్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్ నార్డ్ CE4 5G ఫోన్ ధర రూ.3వేలు తగ్గింపును పొందింది. రూ.24,999కి రిటైల్ అవుతుంది. వినియోగదారులు రూ.2వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 2 కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB కలిగి ఉంది. బేస్ మోడల్‌ను కేవలం రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.

హై-ఎండ్ వెర్షన్ ధర రూ.21,999కు లభిస్తోంది. మార్బుల్, డార్క్ క్రోమ్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. అమెజాన్ రూ.22వేల వరకు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ.5వేలకు ఎక్స్ఛేంజ్ చేస్తే.. కొత్త ఫోన్ రూ.15వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ట్రేడ్-ఇన్ వాల్యూ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Highest FD Rate : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులివే..!

వన్‌ప్లస్ నార్డ్ CE4 5G స్పెసిఫికేషన్లు :
ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో 8GB ర్యామ్ కలిగి ఉంది. 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14పై రన్ అవుతుంది. 5,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది పవర్-అప్‌ కోసం 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ కలిగి ఉంది.

వన్‌‌ప్లస్ ఫోన్ కెమెరా ఫీచర్లు :
బ్యాక్ సైడ్.. డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OISతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C ఉన్నాయి.