Highest FD Rate : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులివే..!
Highest FD Rate : సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..

Highest FD Rate
Highest FD Rate : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
సీనియర్ సీటిజన్ల కోసం చాలా బ్యాంకులు కూడా అంతే స్థాయిలో అధిక వడ్డీలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు FDపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. ముందుగా పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా ఈ బ్యాంకుల జాబితాను ఓసారి చెక్ చేయడం బెటర్..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు :
సీనియర్ సిటిజన్ల కోసం SIP, గోల్డ్ సహా అనేక పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ, చాలా మంది సీనియర్ సిటిజన్లు ఇప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) సురక్షితమైనవిగా భావిస్తారు. సీనియర్ సిటిజన్లకు సాధారణ కస్టమర్ల కన్నా బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.
తద్వారా అధిక మొత్తంలోరాబడిని పొందవచ్చు. 5 చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన FD వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ బ్యాంకులేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ :
ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 5 ఏళ్ల వరకు FDలపై 4.50 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అత్యధిక వడ్డీ రేటు 9.10శాతం. సీనియర్ సిటిజన్లకు 1001 రోజుల FDలపై మాత్రమే వర్తిస్తుంది. ఈ కొత్త డిపాజిట్ వడ్డీ రేట్లను 11 మార్చి 2025 నుంచి అమల్లోకి తెచ్చింది.
DCB బ్యాంక్ వడ్డీ రేట్లు :
సీనియర్ సిటిజన్లకు డీసీబీ బ్యాంక్ 7 రోజుల నుంచి 120 నెలల వరకు FDలపై 4.25శాతం నుంచి 8.25శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 8.25శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 15 నెలల FDలపై వర్తిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లను బ్యాంక్ 7 మే 2025 నుంచి అమల్లోకి తెచ్చింది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :
ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు FDలపై గరిష్టంగా 8.05 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీని పొందవచ్చు. గరిష్టంగా 8.55 శాతం వరకు రాబడిని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ FDలకు వర్తిస్తాయి. కొత్త వడ్డీ రేట్లు 24 ఏప్రిల్ 2025 నుంచి అమలులోకి వస్తాయి.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :
ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి 120 నెలల వరకు FDలపై 4శాతం నుంచి 9శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 9శాతం. సీనియర్ సిటిజన్లు రూ. 3 కోట్ల వరకు FDలపై భారీ వడ్డీని పొందవచ్చు.
Read Also : Samsung Galaxy S24 FE 5G : అమెజాన్ బంపర్ ఆఫర్.. కొంటే ఇలాంటి శాంసంగ్ 5G ఫోన్ కొనాలి భయ్యా.. ఎందుకంటే?
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :
సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు FDలపై 4.50శాతం నుంచి 8.75శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల FDలపై అత్యధిక వడ్డీ 8.75శాతం అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ ఉన్న డిపాజిట్లపై వర్తిస్తాయి. మే 5, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.