SIP Calculator : SIPలో నెలకు రూ. 14వేల పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.13 కోట్లకు పైగా సంపాదించవచ్చంటే? ఫుల్ డిటెయిల్స్..!

SIP Calculator : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? రూ. 14వేలతో ఇలా పెట్టుబడి పెడుతూ పోతే ఎన్ని ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చంటే?

SIP Calculator : SIPలో నెలకు రూ. 14వేల పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.13 కోట్లకు పైగా సంపాదించవచ్చంటే? ఫుల్ డిటెయిల్స్..!

SIP Calculator

Updated On : June 21, 2025 / 4:17 PM IST

SIP Calculator : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి వస్తుందో అర్థం కావడం లేదా? సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP Calculator) గురించి తప్పక తెలుసుకోండి..

మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మార్గమని చెప్పవచ్చు. సాధారణంగా పెట్టుబడిదారులు తమ డబ్బును కావాల్సిన ఈక్విటీల వైపు మళ్లీంచుకోవచ్చు. మీరు ప్రస్తుతం SIPలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే.. నెలకు రూ. 14వేల పెట్టుబడితో రూ. 13 కోట్ల భారీ కార్పస్‌ సంపాదించుకోవచ్చు.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అంటే ఏంటి?
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది మ్యూచువల్ ఫండ్లలో అద్భుతమైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్.. డబ్బులను ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ ఎంపికను బట్టి రోజువారీ, వారం, నెలవారీ, త్రైమాసిక లేదా వార్షికంగా పెట్టుబడి పెట్టవచ్చు. నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు.

Read Also : iPhone 16 Pro : అత్యంత ఖరీదైన ఈ ఐఫోన్లను ఇలా కొంటే.. అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..!

ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీతో SIP ఏర్పాటు చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్దిష్ట మొత్తం నెలవారీగా కట్ అవుతుంది. ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టమని సూచించవచ్చు. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ద్వారా కాలక్రమేణా ఊహించని మొత్తంలో భారీగా రాబడిని పొందవచ్చు.

SIP బెనిఫిట్స్ ఇవే :
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి రూ. 100 కన్నా తక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. చాలా SIP ప్లాన్లలో చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు. SIP లిక్విడిటీని అందిస్తాయి. అంతేకాదు.. పెట్టుబడిదారులు SIPలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా లేదా రీడీమ్ చేసుకోవచ్చు. ఫండ్ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది. అయితే, ఇతర ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. SIP లిక్విడిటీకి అవకాశం ఉన్నప్పటికీ ముందస్తు విత్‌డ్రా చేసేందుకు పెనాల్టీ చెల్లించాలి. కొన్నిసార్లు క్యాష్ వెంటనే తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

దీర్ఘకాలికంగా కొనసాగిస్తే మీ సంపాదన భారీ మొత్తంలో పెరుగుతూ పోతుంది. కాలక్రమేణా పెట్టుబడిపై సంపాదన పెంచుకుంటూ పోవచ్చు. పెట్టుబడిని క్రమం తప్పకుండా పెట్టడం ద్వారా ఎలాంటి ఒత్తిడి ఉండదు.

మార్కెట్ హెచ్చుతగ్గుదల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో భారీగా రాబడిని పొందవచ్చు. అందుకే ముందుగానే పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. SIPలో నెలకు రూ. 14వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 13 కోట్ల కార్పస్‌ ఎన్ని ఏళ్లలో సంపాదించగలరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రూ. 13 కోట్ల కార్పస్ పొందాలంటే…
నెలవారీ పెట్టుబడి : రూ. 14వేలు
వార్షిక రాబడి : 12 శాతం
10ఏళ్ల నుంచి 40ఏళ్ల వరకు వ్యవధి

నెలకు రూ.14వేల SIP పెట్టుబడితో 10 ఏళ్లలో ఎంత వస్తుందంటే? :
నెలకు రూ. 14వేలు పెట్టుబడి అయితే మొత్తం రూ. 16,80,000 అవుతుంది. క్యాపిటల గెయిన్స్ రూ. 14,56,502 అవుతుంది. అప్పుడు రిటైర్మెంట్ కార్పస్ రూ. 31,36,502 వరకు వస్తుంది.

నెలకు రూ.14వేలతో 20 ఏళ్ల రాబడి ఎంతంటే? :
నెలకు రూ. 14వేలు SIPలో పెట్టుబడి మొత్తం రూ. 33 లక్షల 60వేలు అవుతుంది. క్యాపిటల్ గెయిన్స్ రూ. 95,18,003 అవుతుంది. రిటైర్మెంట్ కార్పస్ రూ. 1,28,78,003 వరకు వస్తుంది.

నెలకు రూ.14వేలతో 30ఏళ్లలో ఎంతంటే? :
నెలకు రూ. 14వేలతో SIPలో పెట్టుబడి పెడితే మొత్తం రూ. 50 లక్షల 40వేలు అవుతుంది. క్యాపిటల్ గెయిన్స్ రూ. 3,80,93,625, రిటైర్మెంట్ కార్పస్ రూ. 4,31,33,625 (అంచనా) వస్తుంది.

Read Also : Best Coding Laptops : కోడింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ కోసం బెస్ట్ ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే.. ఓసారి లుక్కేయండి..!

నెలకు రూ.9వేలతో 40 ఏళ్లలో ఎంతంటే? :
నెలకు రూ. 9వేల పెట్టుబడితో మొత్తంగా రూ. 67 లక్షల 20వేలు అవుతుంది. కనీస రాబడి రూ. 13,03,82,994గా ఉంటే.. రిటైర్మెంట్ కార్పస్ రూ. 13,71,02,994 వరకు ఉంటుంది.

నెలకు రూ.14వేలు SIPలో పెట్టుబడితో రూ.13 కోట్లకు పైగా రాబడి? :
నెలకు రూ.14వేలు పెట్టుబడితో తొందరగా రూ.13 కోట్లకు పైగా సంపాదించాలంటే మీకు దాదాపు 40 ఏళ్ల వరకు సమయం పట్టవచ్చు.