Best Coding Laptops : కోడింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ కోసం బెస్ట్ ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే.. ఓసారి లుక్కేయండి..!
Best Coding Laptops : 2025లో కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్చుకునే విద్యార్థుల కోసం టాప్ 7 బెస్ట్ కోడింగ్ ల్యాప్‌టాప్స్.. ఇందులో ఏది కొంటారో మీ ఇష్టం..

Best Low Budget Laptops
Best Coding Laptops : మీరు ప్రోగ్రామింగ్ కోసం ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? 2025లో కోడింగ్ నేర్చుకునే విద్యార్థులకు బడ్జెట్ ధరలో అద్భుతమైన ప్రొగ్రామింగ్ ల్యాప్‌టాప్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కోడింగ్ ల్యాప్‌టాప్‌లో ప్రధానంగా ర్యామ్ 16GB వరకు ఉండాలి. ఏదైనా కోడ్ వేగంగా కంపైల్ చేయొచ్చు. అదేవిధంగా CPU కూడా అదే స్పీడ్ ఉండాలి. స్టోరేజీ స్పేస్ కూడా ఎక్కువగా ఉండాలి.
కీబోర్డ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉండాలి. ఇతర డివైజ్‌ల కోసం మంచి పోర్ట్ ఆప్షన్ ఉండాలి. బిల్డ్, పోర్టబిలిటీ, బ్యాటరీ లైఫ్ కూడా చాలా ముఖ్యమే. మీ అవసరాలకు తగిన బెస్ట్ ప్రోగామింగ్ ల్యాప్‌టాప్ ఎంచుకోవాలి. మీకోసం 2025లో కోడింగ్ కోసం అద్భుతమైన ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్స్ జాబితాను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ల్యాప్ టాప్ ఎంచుకుని కొనేసుకోండి.
1. ఏసర్ ఆస్పైర్ 5 (2024) :
CPU : ఇంటెల్ కోర్ i5 (13వ జనరేషన్)/AMD రైజెన్ 5 7530U
ర్యామ్ : 16GB
స్టోరేజీ : 512GB SSD
డిస్‌ప్లే : 15.6″ FHD
బ్యాటరీ లైఫ్ : 8 గంటలు
OS : విండోస్ 11
ఎందుకు బెటర్ : ధరకు తగ్గ పర్ఫార్మెన్స్, పైథాన్, జావా, వెబ్ డెవలపర్‌లకు బెస్ట్, అప్‌గ్రేడబుల్ ర్యామ్, SSD స్టోరేజీ పెంచుకోవచ్చు.
2. ASUS వివోబుక్ 15 :
CPU : AMD రైజెన్ 5 5500U
ర్యామ్ : 16GB
స్టోరేజీ : 512 GB SSD
డిస్‌ప్లే : 15.6″ FHD
బ్యాటరీ లైఫ్ : 7-8 గంటలు
ఎందుకు బెటర్ : సరసమైన ధర, అద్భుతమైన పర్ఫార్మెన్స్, కీబోర్డ్, మంచి క్వాలిటీ డివైజ్
3. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 (2024)
CPU : ఆపిల్ M2 చిప్
ర్యామ్ : 8GB (16GB అప్‌గ్రేడ్)
స్టోరేజీ : 256-512GB SSD
డిస్‌ప్లే : 13.6″ లిక్విడ్ రెటినా
బ్యాటరీ లైఫ్ : 15-18 గంటలు
OS : మ్యాక్ (MacOS)
ఎందుకు బెటర్ : అద్భుతమైన బ్యాటరీ, సైలంట్ (ఫ్యాన్ లెస్ ), పైథాన్, వెబ్, iOS డెవలప్‌మెంట్, UNIX-ఆధారిత macOS డెవలపర్ కు యూజర్ ఫ్రెండ్లీ
4. డెల్ XPS 13 (2024) :
CPU : ఇంటెల్ కోర్ i7 (13వ జనరేషన్ )
ర్యామ్ : 16GB
స్టోరేజీ : 512GB SSD
డిస్‌ప్లే : 13.4” FHD+, 3.5K OLED
బ్యాటరీ లైఫ్ : 10-12 గంటలు
OS : విండోస్ 11, Ubuntu
ఎందుకు బెటర్ : ప్రీమియం ఎక్స్‌పీరియన్స్, కీబోర్డ్, పోర్టబుల్. మల్టీ లాంగ్వేజీ డెవలపర్‌లకు (పైథాన్, C++, జావాస్క్రిప్ట్ ) బెస్ట్ మోడల్.
5. మ్యాక్‌బుక్ ప్రో M3 (2023-2024) :
CPU : ఆపిల్ M3 లేదా M3 ప్రో
ర్యామ్ : 16-32GB
స్టోరేజ్ : 512GB-1TB SSD
డిస్‌ప్లే : 14” లేదా 16” లిక్విడ్ రెటినా XDR
బ్యాటరీ లైఫ్ : 20 గంటల వరకు
ఎందుకు బెటర్ : అడ్వాన్స్ టెక్నాలజీ (AI/ML, iOS యాప్, మల్టీ టాస్కింగ్) కలిగి ఉంది. ఎక్కువ కాలం మన్నిక, అద్భుతమైన స్క్రీన్, బెటర్ పర్ఫార్మెన్స్.
6. లెనోవా థింక్‌ప్యాడ్ X1 కార్బన్ జెన్ 12 (2024) :
CPU : ఇంటెల్ కోర్ అల్ట్రా 7
ర్యామ్ : 16-32GB
స్టోరేజ్ : 512GB-1TB SSD
డిస్‌ప్లే : 14″ WUXGA లేదా 2.8K OLED
బ్యాటరీ లైఫ్ : 12 గంటల వరకు బ్యాకప్
ఎందుకు బెటర్ : లెజెండరీ కీబోర్డ్, లైనెక్స్-ఫ్రెండ్లీ, మన్నికతో పాటు సేఫ్టీ కూడా. ప్రొఫెషనల్-గ్రేడ్ డెవలపర్‌కు బెస్ట్ మోడల్
Read Also : iPhone 16 Pro : అత్యంత ఖరీదైన ఈ ఐఫోన్లను ఇలా కొంటే.. అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..!
7. ఫ్రేమ్‌వర్క్ ల్యాప్‌టాప్ 13 (2024) :
CPU : ఇంటెల్ కోర్ అల్ట్రా, AMD రైజెన్ 7
ర్యామ్ : 16GB, 32GB (మాడ్యులర్)
స్టోరేజీ : 512GB , 1TB (అప్‌గ్రేడ్ )
OS : Linux, Windows
ఆపరేటింగ్ సిస్టమ్
ఎందుకు బెటర్ : ఫుల్ రిపేర్ ఆప్షన్ కలిగి ఉంది. కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయొచ్చు.. హార్డ్‌వేర్ + సాఫ్ట్‌వేర్ లైనక్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేందుకు బెస్ట్ ల్యాప్‌టాప్