Motorola Edge 50 Pro : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనేసుకోండి.. డోంట్ మిస్!

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 సందర్భంగా అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి.

Motorola Edge 50 Pro : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనేసుకోండి.. డోంట్ మిస్!

Motorola Edge 50 Pro Sale

Updated On : August 5, 2025 / 4:44 PM IST

Motorola Edge 50 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర భారీగా తగ్గింది. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తుంటే (Motorola Edge 50 Pro) ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 సందర్భంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రూ. 30వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఆఫర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర రూ.31,999కి లాంచ్ కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ.27,999కి లిస్ట్ అయింది. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. 5 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ధర రూ.23,999కి తగ్గుతుంది.

Read Also : భారత్‌లో వివో వై400 5జీ విడుదల.. కొంటారా? ఆఫర్లు ఎలా ఉన్నాయంటే? ఫీచర్లు అబ్బబ్బ ఏమున్నాయ్‌..

పాత స్మార్ట్‌ఫోన్‌ మోటోరోలా ఎడ్జ్ 40 నియోతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా రూ.10,250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ప్రీమియం ఫోన్ రూ.13,749 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 125W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది. 4500mAh బ్యాటరీని వెంటనే ఛార్జ్ చేస్తుంది.

ఫొటోగ్రఫీ ప్రియులకు ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.