భారత్‌లో వివో వై400 5జీ విడుదల.. కొంటారా? ఆఫర్లు ఎలా ఉన్నాయంటే? ఫీచర్లు అబ్బబ్బ ఏమున్నాయ్..
వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పార్ట్‌నర్ రిటైల్ అవుట్‌లెట్లు ద్వారా కొనుగోలు చేయవచ్చు. 2025 ఆగస్టు 4 నుంచి ప్రీ-బుకింగ్ ప్రారంభమయ్యాయి, ఆగస్టు 7 నుంచి యూజర్లకు అందుతాయి.

చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారత్‌లో వివో వై400 5జీను విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ 120హెచ్‌జెడ్ ఎమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, గరిష్ఠంగా 256జీబీ స్టోరేజ్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 90వాట్స్ చార్జింగ్ తో వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతుంది.
వివో వై400 5జీ ధర
ఈ ఫోన్ రెండు ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ – ధర రూ. 21,999
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ – ధర రూ. 23,999
గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ కలర్స్‌లో
వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పార్ట్‌నర్ రిటైల్ అవుట్‌లెట్లు ద్వారా కొనుగోలు చేయవచ్చు. 2025 ఆగస్టు 4 నుంచి ప్రీ-బుకింగ్ ప్రారంభమయ్యాయి, ఆగస్టు 7 నుంచి యూజర్లకు అందుతాయి.
లాంచ్ సందర్భంగా వివో ఎస్‌బీఐ, డీబీఎస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, యస్, బీఓబీ కార్డ్, ఫెడరల్ బ్యాంకులపై గరిష్ఠంగా 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
వివో వై400 ఫైజీ స్పెసిఫికేషన్లు
డిజైన్: బరోక్ నాక్ర్ టెక్స్చర్, స్లిమ్ ప్రొఫైల్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఎఫ్ఎచ్డీ+ ఎమోలెడ్ డాచ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠ బ్రైట్‌నెస్ 1800 నిట్స్
ప్రోసెసర్: 4ఎన్ఎం ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2
ఆడియో: స్టీరియో స్పీకర్లు, 400 శాతం వాల్యూమ్ బూస్ట్
రియర్ కెమెరా: 50ఎంపీ సోనీ ఐఎమ్‌ఎక్స్852 ప్రైమరీ, 2ఎంపీ సెకండరీ కెమెరా, అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ మోడ్
ఫ్రంట్ కెమెరా: 32ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 6000ఎంఏహెచ్, 90వాట్ట్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్
ఓపరేటింగ్ సిస్టమ్: ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15
రేటింగ్స్: ఐపీ68, ఐపీ69 – ధూళి, నీటి నిరోధకత
ఏఐ ఫీచర్లు: ఏఐ ఈరేస్ 2.0, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్టెంట్, ఏఐ నోట్ అసిస్టెంట్, ఏఐ డాక్యుమెంట్స్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, గూగుల్ తో సర్కిల్ టు సెర్చ్, ఏఐ సూపర్‌లింక్.
ఫీచర్ | వివరాలు |
---|---|
డిస్ప్లే | 120హెర్జ్ | 6.67-ఇంచుల FHD+ AMOLED |
ప్రాసెసర్ | స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 |
ర్యామ్ + నిల్వ | 8GB ర్యామ్, గరిష్ఠంగా 256GB స్టోరేజ్ |
వెనుక కెమెరా | 50MP + 2MP |
ముందు కెమెరా | 32MP |
బ్యాటరీ | 6,000mAh బ్యాటరీ |
చార్జింగ్ సామర్థ్యం | 90W |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఫన్‌టచ్ 15 ఆధారంగా ఆండ్రాయిడ్ 15 |
View this post on Instagram