Iran vs Israel War : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మృతి.. ఫ్యామిలీ మొత్తాన్నీ లేపేశారు.. వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ ఇరానియన్ల సంబురాలు
Iran vs Israel War : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందాడు.
Iran vs Israel War
- ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతి
- అధికారికంగా ధ్రువీకరించిన ఇరాన్
- పలు ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేసిన ఇరానియన్లు
Iran vs Israel War : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందాడు. యూఎస్, ఇజ్రాయెల్ దళాలు ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దాదాపు 30 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ క్రమంలో ఖమేనితోపాటు ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనమరాలు మృతిచెందినట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ సంస్థ కాన్, ప్రముఖ ఛానెల్ 12 వెల్లడించిన వివరాల ప్రకారం.. టెహ్రాన్ లోని ఖమేనీ నివాసంపై జరిగిన భారీ బాంబు దాడిలో ఖమేనీ మరణించారు. దాడి జరిగిన కొన్ని గంటల తరువాత నివాస శిథిలాల నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసినట్లు సమాచారం. ఖమేనీ మృతదేహాన్ని వెలికితీసి దానికి సంబంధించిన ఫొటో అధారాలను ట్రంప్, నెతన్యాహులకు పంపారని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఖమేనీ మరణవార్త వెలువడినప్పటి నుంచి ఇరాన్ అధికారిక వార్తా ఛానెల్ ‘IRINN’ శోకతప్త హృదయంతో వార్తలను ప్రసారం చేస్తోంది. టీవీ స్క్రీన్ పైభాగంలో నలుపు రంగు బ్యానర్ ను ప్రదర్శిస్తూ ఖమేనీ చిత్రపటాల వెనుక నేపథ్యంగా ఖరాన్ పఠనాన్ని వినిపిస్తుంది. కమేనీ మృతితో ఇరాన్ ప్రజానీకం శోకసముద్రంలో మునిగిపోయింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇరాన్ అధికారికంగా పేర్కొంది. ఈ క్రమంలో 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. మరోవైపు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలతో వీధులు మార్మోగినట్లు రిపోర్టు చేశాయి. ఇరాన్ శివారు ప్రాంతమైన బైసత్ టౌన్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియోను ఫాక్స్ న్యూస్ పోస్టు చేసింది. ఖమేనీ మరణ వార్త తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లేవీ ఒక వీడియోను పంచుకున్నారు.
👏Breaking: Fardis, Iran — NOW: Iranians launch fireworks, honk horns in joy, crowds celebrate death of regime dictator Khamenei.
Support Trump & Israel freeing Iran?
A. Yes
B. NoVia @realRayanAmiri pic.twitter.com/VylUx1S27S
— 𝔉🅰𝒏 Karoline Leavitt (@WHLeavitt) March 1, 2026
🔴BREAKING:
We have the first footage of street parties breaking out in Tehran.
You don’t understand our happiness.
— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 🇮🇷 ✡︎ (@NiohBerg) February 28, 2026
ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతోపాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, ఇరాన్ గార్డ్స్ కమాండర్ పక్సూర్ మృతి చెందారు. మొత్తం ఏడుగురు సీనియర్ అధికారులు కూడా హతమయ్యారు. ఐఏఎఫ్ ఫైటర్ జెట్ లు ఇరాన్ అంతటా సైనిక లక్ష్యాలను ఢీకొట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ నాయకత్వంలోని ఏడుగురు సీనియర్ అధికారులు మృతి చెందారు. వీరిలో అలీ షంఖానీ, మొహమ్మద్ పక్పూర్, సలేహ్ అసది, మొహమ్మద్ షిరాజీ, అజీజ్ నాసిర్జాదే, హుస్సేన్ జబల్ అమేలియన్, రెజా మొజాఫారి-నిమయా ఉన్నట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది.
