Mukesh Ambani Net Worth : ఒక్క దెబ్బతో సీన్ రివర్స్.. ఆసియా సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ టాప్!
Mukesh Ambani Net Worth : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు నెలకొల్పారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్టులో టాప్ ప్లేసులో నిలిచారు..
Mukesh Ambani Net Worth
- జాంగ్ యిమింగ్కు షాక్.. ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ
- అంబానీ సంపద జెట్ స్పీడ్.. ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్‌గా కొత్త రికార్డ్
- ఒక్కసారిగా పెరిగిన రిలయన్స్ షేర్లు.. 88.8 బిలియన్ డాలర్ల సంపద
Mukesh Ambani Net Worth : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి తన సత్తా చాటారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఫోర్బ్స్ రిలీజ్ చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో బైట్‌డ్యాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం.. ముఖేష్ అంబానీ మొత్తం సంపద 88.8 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 22వ స్థానంలో నిలిచారు. తాజాగా అంబానీ సంపద ఏకంగా 10.5 శాతం పెరగడం విశేషం.
రిలయన్స్ షేర్ల దూకుడు.. భారీ సంపద :
సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా 12 శాతం మేర పెరిగాయి. దాంతో అంబానీ సంపదలోనూ భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా జియో ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన భారీ స్పందన రావడంతో రిలయన్స్ మార్కెట్ విలువపై ఒక్కసారి పైకి దూసుకెళ్లింది.
Read Also : Charging Ejector : రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా డోంట్ వర్రీ.. 100 శాతం ఛార్జ్ అవ్వగానే పిన్ ఔట్!
మరోవైపు జాంగ్ యిమింగ్ 84 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి పరిమితమయ్యారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 80.1 బిలియన్ డాలర్ల సంపదతో 26వ స్థానంలో నిలిచారు.
రిలయన్స్ ఆదాయంలోనూ భారీ జంప్ :
రిలయన్స్ సమీకృత ఆదాయం గత ఏడాదితో పోలిస్తే.. 28 శాతం పెరిగి రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది. (EBITDA) 24 శాతం వృద్ధితో రూ.62,409 కోట్లకు చేరగా, నికర లాభం 34 శాతం పెరిగి రూ.29,550 కోట్లుగా నమోదైంది.
ఇక అక్టోబర్ 28న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ ప్రారంభించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ తొలి రోజే 27 శాతం లాభంతో దూసుకెళ్లింది. జియోలో రిలయన్స్‌కు సుమారు 66 శాతం వాటా ఉంది. ఈ ఏడాది ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ 55వ స్థానాన్ని దక్కించుకుంది. జియో ఐపీఓ, షేర్ల ర్యాలీ, పెరుగుతున్న ఆదాయంతో అంబానీ సంపద మరింత పెరగడంతో ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
