Charging Ejector : రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా డోంట్ వర్రీ.. 100 శాతం ఛార్జ్ అవ్వగానే పిన్ ఔట్!
Charging Ejector : రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోతున్నారా? ఛార్జింగ్ ఎజెక్టర్ గాడ్జెట్లు ఎలా పనిచేస్తాయి? ధర ఎంత? కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాటరీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Automatic Charger Ejectors
- ఛార్జింగ్ పెట్టి హాయిగా నిద్రపోండి.. ఆటోమేటిక్‌గా పిన్ బయటకు
- ఫోన్ ఓవర్ ఛార్జింగ్‌కు చెక్.. మార్కెట్లోకి ఛార్జింగ్ ఎజెక్టర్లు
- రాత్రంతా ఛార్జింగ్ టెన్షన్ వద్దు..
- ఈ చిన్న డివైజ్‌తో బోలెడు బెనిఫిట్స్
Charging Ejector : రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? ఇక నో టెన్షన్.. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ అలవాటు ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్‌కు ఛార్జర్ పెట్టి ఉదయం వరకు అలాగే వదిలేస్తుంటారు. అయితే, ఇలా ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ వేడెక్కడం, దీర్ఘకాలంలో బ్యాటరీ సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.
కొన్ని సందర్భాల్లో క్వాలిటీ లేని ఛార్జర్లు, దెబ్బతిన్న కనెక్టర్ల కారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మార్కెట్లోకి ఛార్జింగ్ ఎజెక్టర్ గాడ్జెట్లు (Charging Ejectors) అందుబాటులోకి వచ్చాయి.
ఎలా పనిచేస్తాయంటే? :
ఈ చిన్న డివైజ్‌లో ఛార్జింగ్ గుర్తించే సిస్టమ్‌తో పాటు ప్రత్యేకమైన పార్టులు ఉంటాయి. బ్యాటరీ ఛార్జింగ్ నిర్ణీత స్థాయికి రీచ్ కాగానే పవర్ సప్లయ్ ఆగిపోవచ్చు లేదా ఎజెక్టర్ మెకానిజం పనిచేసి ఛార్జింగ్ కనెక్టర్‌ను ఆటోమేటిక్‌గా బయటకు నెడుతుంది. దీంతో చేతితో పిన్ తీయాల్సిన పనిఉండదు. అయితే అన్ని గాడ్జెట్ల పర్ఫార్మెన్స్ ఒకేలా ఉండదు.
Read Also : Vivo Y32 5G Launch : 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త వివో Y32 5G వచ్చేసింది.. ధర జస్ట్ ఎంతంటే?
ధర ఎంతంటే? :
ప్రస్తుతం మార్కెట్లో ఈ గాడ్జెట్ల ధర సుమారు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉంది. కొన్ని డివైజ్‌లను బ్యాటరీ శాతాన్ని నేరుగా గుర్తించకుండా విద్యుత్ సరఫరాలో మార్పుల ఆధారంగా ఛార్జింగ్ పూర్తయినట్లు అంచనా వేస్తాయి. అందుకే కొనేముందు పిన్ నిజంగానే బయటకు వస్తుందా? లేక పవర్ సప్లయ్ మాత్రమే ఆగుతుందా? అనేది చెక్ చేసుకోవాలి..
బ్యాటరీకి ఎంత మేలు? :
ఛార్జింగ్ పూర్తయ్యాక కనెక్షన్ ఆటో రిమూవ్ చేయడం బాగుంది.. అయితే, దీనివల్ల బ్యాటరీ లైఫ్ టైమ్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పలేం. మోడ్రాన్ ఫోన్లలో ఇప్పటికే ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్, ఛార్జ్ లిమిట్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి లేని పాత ఫోన్లకు ఎజెక్టర్లు బెనిఫిట్ అని చెప్పొచ్చు..
ముఖ్యమైన జాగ్రత్తలివే :
నాణ్యమైన తయారీదారుల గాడ్జెట్లనే ఎంచుకోవాలి. వారంటీ, సేఫ్టీ స్టాండర్డ్స్, ఫోన్ ఛార్జింగ్ సపోర్ట్ చెక్ చేయాలి. పిన్ను ఫోర్సుగా పోర్టులో పెట్టకూడదు. ఫోన్‌ను దిండు, దుప్పటి కింద పెట్టి ఛార్జింగ్ చేయకూడదు. కేబుల్ లేదా కనెక్టర్ అబ్ నార్మల్ గా వేడెక్కినా, కాలిన వాసన వచ్చినా వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి.
