Renault Duster Launch
Renault Duster : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు రెనాల్ట్ లవర్స్ అయితే మీకోసం అద్భుతమైన న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ కొత్త అవతార్ వచ్చేస్తోంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ మార్కెట్లో వివిధ సెగ్మెంట్లలో అనేక కార్లను అందిస్తోంది.
ఇప్పుడు, రెనాల్ట్ పాపులర్ SUV, రెనాల్ట్ డస్టర్‌ను తిరిగి లాంచ్ చేస్తోంది. ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ వచ్చే నెల మార్చి 17న మార్కెట్లో లాంచ్ కానుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ ఈ SUV థర్డ్ జనరేషన్ మోడల్. కంపెనీ కొత్త అప్ డేట్స్ సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేయనుంది.
2022లో కంపెనీ ఈ SUV మోడల్ తయారీ నిలిపివేసింది. ఆ తర్వాత భారత మార్కెట్‌లోకి ఈ కొత్త అవతార్‌గా రీఎంట్రీ ఇవ్వనుంది. డిస్‌ప్లే, డెమో యూనిట్లు ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్నాయి. కస్టమర్ డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. రెనాల్ట్ డస్టర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త రెనాల్ట్ డస్టర్ లుక్ గ్లోబల్ మోడల్ మాదిరిగానే ఉంది. కానీ, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా కొన్ని మార్పులతో రానుంది. ఈ SUV ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఆప్షన్లతో వస్తుంది. టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి.
డస్టర్ బ్యాడ్జ్‌తో కొత్త గ్రిల్, సిల్వర్-యాక్సెంట్ బంపర్, పిక్సెల్-స్టైల్ ఫాగ్ ల్యాంప్‌లు SUVకి బోల్డ్ అడ్వాన్స్ డిజైన్ ఇస్తాయి. కొత్త రెనాల్ట్ డస్టర్ గతంలో కన్నా మరింత ప్రీమియంగా వస్తుంది. ఈ SUVలో కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త రెనాల్ట్ డస్టర్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, లెవల్-2 అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
కొత్త రెనాల్ట్ డస్టర్ ఇంజిన్ :
కొత్త రెనాల్ట్ డస్టర్ 1.8-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ వంటి వివిధ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రీ-బుకింగ్, డెలివరీలు :
కొత్త డస్టర్ కోసం ప్రీ-బుకింగ్‌లు రూ. 21వేల నుంచి ప్రారంభమయ్యాయి. కొత్త SUV కోసం కంపెనీ ఇంకా అధికారిక ధరలను ప్రకటించలేదు. ఈ ఎస్ యూవీ లాంచ్ తర్వాత ధరలు ప్రకటించే అవకాశం ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్ డెలివరీలు లాంచ్ తర్వాత వెంటనే ప్రారంభమవుతాయి. హైబ్రిడ్ వేరియంట్ డెలివరీలు 2026 దీపావళి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.